Andhra News: ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
కామాతురాణం న భయం, న లజ్జ అన్నారు నాటి పెద్దలు.. ఆ మాటు ఇప్పుడు నిజమవుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు కామాంధులు.. వస్సుతో సంబంధం లేకుండా మహిళలపై అఘయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కిరాతకుడు తన మనవరాలి వయస్సున్న ఇద్దరి బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

కామాతురాణం న భయం, న లజ్జ అన్నారు నాటి పెద్దలు.. అటేం కామం (మోహం)తో కళ్లు మూసుకుపోయిన వారికి భయం గానీ సిగ్గు గానీ ఉండవు అని అర్థం. తాజాగా అలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ కామాంధుడు తన మనవరాళ్ళ వయస్సున్న పదకొండేళ్ళ ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్య సమాజంతో పాటు ఆ దౌర్భాగ్యుడి కుటుంబం కూడా తలదించుకునేలా చేశాడు. బాధిత కుటుంబ సభ్యుల సమాచారంతో నిందితుడిపై అత్యాచారం, ఫోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని ఓ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యాభై సంవత్సరాల పిక్కిలి ఆంజనేయులు అనే వ్యక్తి మాయ మాటలతో ఇద్దరు బాలికల పై లైంగిక దాడికి పాల్పడ్డాడు.. ఆరు, ఏడు తరగతులు చదువుతున్న బాలికలు తినుబండారాల కోసం ఆంజనేయులు దుకాణం వద్దకు వెళ్ళారు. ఇదే అదునుగా భావించిన అతడు వారికి చాకెట్లు, బిస్కట్లు, డబ్బులు ఇస్తానంటూ ఇంట్లోకి తీసుకెళ్ళాడు. బాలికల నోట్లో వస్త్రాలను కుక్కి ఒకరి తరువాత మరొకరిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
అతడి నుంచి తప్పించుకున్న ఇద్దరు బాలికలు తీవ్ర భయాందోళనకు గురై జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ ఇద్దరు బాలికల తల్లిదండ్రులు యర్రగొండపాలెంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేసారు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడి పై పోక్సో కేసు నమోదు చేసారు పోలీసులు.. విషయం తెలుసుకున్న నిందితుడు ఆంజనేయులు అప్పటికే ఊరు వదిలి పారిపోయాడు. ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
