చాణక్య నీతి : కష్టాలు వీరి వెంటే.. ఈ సమయంలో పని చేయకపోతే భారీ నష్టమే..
Samatha
27 December 2025
ఆ చార్య చాణక్యుడు అన్ని విషయాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి. ఈయన తన కాలంలోనే అత్యంత తెలివైన వ్యక్తిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా నేటి సమాజానికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే ఆయన ఎవరి వెంట కష్టాలు ఉంటాయో కూడా తెలిపారు.
ఆచార్య చాణక్యుడు ప్రతి వ్యక్తి తప్పకుండా కొన్ని సమయాల్లో కష్టపడి పని చేయాలని చెబుతున్నాడు. లేకపోతే వారు మరణించే వరకు సమస్యలు ఎదుర్కొంటారంట.
ఆ చార్య చాణక్యుడు ప్రతి ఒక్కరూ బాల్యంలో , విద్యార్థి జీవితంలో తప్పకుండా కష్టపడి పని చేయాలి. లేకపోతే మీ వయసు పెరిగే కొద్ది మీరు కష్టాలు ఎదుర్కుంటారని తెలిపారు.
ఎవరు అయితే బాల్యంలో క్రమశిక్షణపై దృష్టి పెట్టరో వారు జీవితంలో చాలా అవకాశాలు కోల్పోతారు. పెద్దలుగా మీరు మీ జీవితంలో ఓడిపోతారంట.
ఏ వ్యక్తి అయితే యవ్వనంలో ఉన్నప్పుడు కష్టపడి పని చేయడో, ఆ వ్యక్తి సోమరితనం, చెడు సహవాసానికి బానిసై భవిష్యత్తులో ఎక్కువ కష్టాలను అనుభవిస్తాడంట.
కొంత మందికి కష్టపడి పని చేసి డబ్బు సంపాదించుకోవడానికి అనేక అవకాశాలు వస్తాయి. కానీ వాటిని ఉపయోగించుకోక, భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు.
అలాగే కష్టసమయాల్లో ఎవరు అయితే కష్టపడి పని చేయరో, వారు వారి కుటుంబ సభ్యులు జీవితాంతం కష్టాలు అనుభవించాల్సి వస్తుందంట.