AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind Vs SL: దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత..కివీస్ పర్యటనకు ముందే వార్నింగ్ బెల్స్!

Ind Vs SL: శ్రీలంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. తిరువనంతపురం వేదికగా శుక్రవారం జరిగిన మూడో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0 ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Ind Vs SL: దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత..కివీస్ పర్యటనకు ముందే వార్నింగ్ బెల్స్!
Team India
Rakesh
|

Updated on: Dec 27, 2025 | 10:50 AM

Share

Ind Vs SL: శ్రీలంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. తిరువనంతపురం వేదికగా శుక్రవారం జరిగిన మూడో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0 ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. రేణుకా సింగ్, దీప్తి శర్మ బౌలింగ్‌లో మాయ చేయగా.. ఓపెనర్ షెఫాలీ వర్మ తన బ్యాటింగ్‌తో శ్రీలంక బౌలర్లను చిత్తు చేసింది.

రేణుకా, దీప్తి దెబ్బకు లంక విలవిల

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌కు బౌలర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఏడాది కాలం తర్వాత టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ (4/21) తన షార్ప్ బంతులతో లంక టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. మరోవైపు స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ (3/18) కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బకొట్టింది. వీరిద్దరి ధాటికి శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక బ్యాటర్లలో ఇమేషా దులని (27), హాసిని పెరీరా (25) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.

దీప్తి శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు

ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా దీప్తి శర్మ మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన ఘనతను అందుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆస్ట్రేలియాకు చెందిన మేగాన్ షుట్‌తో కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచింది. దీప్తి ప్రస్తుతం 151 వికెట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది.

షెఫాలీ వర్మ సిక్సర్ల జాతర

113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ షెఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. స్మృతి మంధాన (1), జెమీమా రోడ్రిగ్స్ (9) త్వరగానే అవుట్ అయినప్పటికీ, షెఫాలీ మాత్రం తగ్గలేదు. కేవలం 42 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో అజేయంగా 79 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (21 నాటౌట్)తో కలిసి ఆమె కేవలం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. అద్భుత స్పెల్ వేసిన రేణుకా సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..