ఆశ్చర్య పోవాల్సిందే.. ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా?
Samatha
27 December 2025
ఇంటి ముందు ముగ్గులు వేయడం కామన్. ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన వెంటనే, తమ ఇంటి ముందు తెల్లటి ముగ్గు పిండితో అందంగా ముగ్గులు వేస్తారు.
ప్రతి రోజూ డిఫరెంట్ స్టైల్‌లో ముగ్గు వేసి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ముగ్గులు ఎందుకు వేస్తారో?
కాగా, ఇప్పుడు మనం ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేస్తారు? దీనికి గల కారణం? అధ్యాత్మిక అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పురాణాల ప్రకారం, ఇంటి ముందు ముగ్గు వేయడం అనేది పరిశుభ్రత, ఆహ్వానానికి చిహ్నం. అంతే కాకుండా ఇది లక్ష్మీదేవికి ఆహ్వానం.
ఏ ఇంటి వారు అయినా సరే అష్టైశ్వార్యాలతో విలసిల్ల, లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆనందంగా ఉండాలి అంటే ఆ ఇంటి యజమాని ఉదయాన్నే లేచి, ఇంటి ముందు ముగ్గు పెట్టాలంట.
ఇంటి ముందు ముగ్గు పెట్టడం అనేది ఇంటి శుభ్రత, ఐక్యతను సూచిస్తుంది. ఇక పౌరాణిక కథ ప్రకారం, ముగ్గు అనేది లక్ష్మీదేవితో ప్రత్యేక సంబంధం ఉంటుందట.
పురాణాల ప్రకారం, సముద్ర మథనం జరిగినప్పుడు, లక్ష్మీ దేవి పుడుతుందంట, అప్పుడు ఆమెను ఇంటిలోకి ఆహ్వానించడానికి దేవతలు, మానవు చాలా ప్రయత్నాలు చేశారు.
లక్ష్మీదేవి భక్తి కాకుండా, పవిత్రత, శుభ్రత, ఉన్న చోట ఉంటుంది. అందుకే ఇంటిలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి రంగు రంగుల ముగ్గులను వేసి, ఆమెను ఇంటిలోకి ఆహ్వానించారంట. అప్పటి నుంచి ముగ్గులు వేస్తారు.