AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chatrapathi Sekhar: ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. ఆరోజు షూటింగ్‏లో జరిగింది ఇదే.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..

నటుడు ఛత్రపతి శేఖర్ గురించి చెప్పక్కర్లేదు. సినిమాలు, సీరియల్స్ ద్వారా సినీరంగంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ రాజమౌళి సినిమాల్లో మాత్రం ఖచ్చితంగా శేఖర్ కనిపిస్తాడు. విలన్ గా, సహయ నటుడిగా అనేక సినిమాల్లో కనిపించి తనదైన నటనతో మెప్పించాడు ఛత్రపతి శేఖర్. గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఛత్రపతి శేఖర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Chatrapathi Sekhar: ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. ఆరోజు షూటింగ్‏లో జరిగింది ఇదే.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
Chatrapathi Sekhar, Prabhas
Rajitha Chanti
|

Updated on: Dec 27, 2025 | 11:44 AM

Share

ఛత్రపతి శేఖర్.. తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు. ఛత్రపతి సినిమాలో ప్రభాస్‌కి ఫ్రెండ్‌గా నటించిన చంద్రశేఖర్ అలియాస్ ఛత్రపతి శేఖర్ .. దాదాపు రాజమౌళి చిత్రాలన్నింటిలోనూ కనిపిస్తుంటారు. అటు సినిమాలతోపాటు ఇటు సీరియల్ నటుడుగాను మంచి క్రేజ్ దక్కించుకున్నారు చంద్రశేఖర్. సహయ నటుడిగానే కాకుండా విలన్ పాత్రలతోనూ తనదైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఛత్రపతి సినిమా షూటింగ్ సమయంలోని తన అనుభవాలను, ముఖ్యంగా ప్రభాస్, రాజమౌళిలతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. రాజమౌళి సినిమా ప్రారంభానికి ముందు జరిగిన సమావేశంలో, తన పాత్ర భద్రం గురించి వివరించిన విధానాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రభాస్ సహనటులతో ఎంత స్నేహంగా, సహకారంగా ఉంటాడో తెలియజేశారు.

ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్‏లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..

ఛత్రపతి షూటింగ్ సమయంలో జరిగిన ఓ ప్రమాదకర సంఘటనను శేఖర్ గుర్తుచేసుకున్నారు. సముద్రంలో ఒడ్డుకు దాదాపు 30-40 కిలోమీటర్ల దూరంలో ఒక దృశ్యాన్ని చిత్రీకరిస్తుండగా ఈ సంఘటన జరిగింది. తాను ఒక చిన్న బోటులో ఉండగా, కెమెరా పెద్ద ఫిషింగ్ బోటులో ఉందన్నారు. ఒక సన్నివేశంలో నీటిలో మునిగి, యాక్షన్ చెప్పగానే పైకి వచ్చి అజయ్ కాలర్ పట్టుకోవాల్సి ఉందన్నారు. తాను పైకి రాగానే, అజయ్ తన కాలర్ పట్టుకోవడంలో విఫలమయ్యాడని, తాను ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయానని.. అప్పుడే ప్రభాస్ తన కాలు పట్టుకుని పైకి లాగారని అన్నారు. తాను నీటిలో జారిపోతున్నా, తన ప్యాంట్ పట్టుకుని లాగుతూనే ఉన్నారని తెలిపారు.ఈ ఘటన తర్వాత ప్రభాస్ చాలా కోపానికి వచ్చాడని గుర్తుచేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్‏గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.

ఛత్రపతి సినిమా ప్రారంభానికి ముందు, రాజమౌళి మొత్తం బృందాన్ని ఒక బీచ్ వద్దకు తీసుకెళ్లి, తన పాత్ర భద్రం గురించి వివరించారని శేఖర్ గుర్తుచేసుకున్నారు. భద్రం పాత్ర బతికి ఉన్నంత వరకు అతను చెప్పిన మాట వినాలని రాజమౌళి ఆదేశించారన్నారు. చిన్న గుడిసెలో అందరితో కలిసి కూర్చొని ప్రభాస్ కూడా కిందే కూర్చొని సన్నివేశాలను విన్నారని తెలిపారు. ప్రభాస్ కేవలం ఒక పెద్ద నటుడు కాదని, షూటింగ్ సమయంలో సహనటులతో కలిసి ఎంతో సరదాగా ఉంటారని అన్నారు.

ఇవి కూడా చదవండి : Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..