మా అమ్మను కాపాడిన చిరుకు.. జీవితాంతం రుణపడి ఉంటాం.. ఊర్వశి రౌతెలా ఎమోషనల్..
మెగాస్టార్ చిరంజీవి ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయపడ్డారు. సామాన్యులు, అభిమానులు, సినీ నటులు, జర్నలిస్టులు, కార్మికులు.. ఇలా కష్టాల్లో ఉన్నవారికి తన వంతు ఆపన్న హస్తం అందించారు. అయితే చాలా వరకు తాను చేసిన గొప్ప పనులను చిరంజీవి బయటకు చెప్పుకోరు. అయితే చిరంజీవి ద్వారా సాయమందుకున్న వారిలో కొందరు అప్పుడప్పుడు ఈ విషయాలను అందరితో పంచుకుంటారు. అలా తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా చిరంజీవి తనకు ఏ విధంగా సాయం చేశారో చెప్పుకొచ్చింది.
ఎమోషనల్ కామెంట్స్ చేసింది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది ఊర్వశి రౌతెలా. ‘బాసూ వేర్ ఈజ్ ద పార్టీ’ అంటూ చిరంజీవితో సరదాగా స్టెప్పులేసింది. సినిమాల సంగతి పక్కన పెడితే కష్ట సమయాల్లో తనకు, తన కుటుంబానికి చిరంజీవి అండగా నిలిచారంటోంది ఊర్వశి. ఇటీవల ఆమె తల్లి మీను రౌతేలా తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఎడమ కాలిలో ఇంట్రా – ఆర్టిక్యులర్ ఫ్రాక్చర్‌తో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు ఊర్వశి. ఇదెంతో ప్రమాదకరమని డాక్టర్లు చెప్పగా ఊర్వశి.. చిరంజీవిని సంప్రదించి సహాయం కోరిందట. దీంతో వెంటనే స్పందించిన మెగాస్టార్.. కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రిలో డాక్టర్ల బృందంతో మాట్లాడి.. మీనూ రౌతెలాకు మెరుగైన వైద్యం అందేలా చేశారట. సర్జరీ అనంతరం ఊర్వశి తల్లి సమస్య నుంచి పూర్తిగా కోలుకున్నారట. ఇప్పుడు ఇదే విషయాన్ని ఊర్వశి అందరితో పంచుకుంది. ఒక్క మాట అడగ్గానే.. చిరంజీవి సాయం చేశారంటూ ట్వీట్ చేసింది. తమ కుటుంబం ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటుందని.. ఆయన్ను దేవుడిగా భావిస్తానంటూ తన పోస్ట్‌లో ఎమోషనల్ గా రాసుకొచ్చింది ఊర్వశి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: నిజమే.. చరణ్ వాచ్ రేటుతో.. హైదరాబాద్ లో ఇల్లే కొనేయచ్చు!
‘ఈ హీరోకు ఏమైంది.. స్టార్ హీరోయిన్లు తీరు మార్చుకోవాలి’
Ram Charan: బయటికి వచ్చిన క్లింకార వీడియో.. నెట్టింట వైరల్
అప్పుడు ఫ్లాప్.. ఇప్పుడు హిట్.. రీ- రిలీజ్‌లో రూ.30 కోట్లు కొల్లగొట్టిన సినిమా…
హీరోయినే అవలేదు.. అప్పుడే రూ.కోట్లకు కోట్లు, మాల్ ఓపెనింగ్‌లు..

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
