‘ఈ హీరోకు ఏమైంది.. స్టార్ హీరోయిన్లు తీరు మార్చుకోవాలి’
సౌత్ ఇండస్ట్రీలోని ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్ హీరోలలో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. తమిళంలో లవ్ టుడే సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరోగానే కాకుండా లవ్ టుడే సినిమాకు దర్శకత్వం వహించి అటు డైరెక్టర్ గానూ సక్సెస్ అయ్యాడు ప్రదీప్.
ప్రస్తుతం డ్రాగన్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలకు హీరోగా, రచయితగా పనిచేస్తున్నాడు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. తాజాగా చెన్నైలో జరిగిన డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ప్రదీప్ రంగనాథన్ కెరీర్ తొలినాళ్లల్లో సినీరంగంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నాడు. తాను హీరో అని తెలియగానే ఎంతో మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశారని తెలిపారు. “నన్ను చాలా మంది కిందకు లాగాలని ప్రయత్నిస్తున్నారు. నేను చూస్తూనే ఉన్నాను. కానీ నేను పెరుగుతున్న మొక్కను. మొక్క మానవడానికి చాలా కష్టపడుతుంది. నేను కూడా అలాగే సవాళ్లు స్వీకరిస్తూ మరింత బలంగా ఎదుగుతాను. నేను హీరోగా నటించిన ఫస్ట్ మూవీ లవ్ టుడే విషయానికి వస్తే.. ఈ సినిమాకు హీరోయిన్ దొరకడం చాలా కష్టమైంది. నేను హీరో అనగానే చాలా మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు. నాతో నటించేందుకు చాలా మంది హీరోయిన్స్ ఆలోచించారు. ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకున్నారు. మరికొందరేమో నిజాయితీగా నా పక్కన చేయనని.. పెద్ద స్టార్లతో మాత్రమే నటిస్తామని చెప్పారు. వారి నిజాయితీకి థాంక్స్” అని అప్పుడు తనకు ఎదురైన పరిస్థితుల గురించి వివరించాడు రంగనాథ్. అయితే ఈ యంగ్ హీరో మాటలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రంగనాథ్‌కు ఏం తక్కువైందంటూ.. స్టార్ హీరోయిన్లు తమ తీరు మార్చుకోవాలనే కామెంట్ వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: బయటికి వచ్చిన క్లింకార వీడియో.. నెట్టింట వైరల్
అప్పుడు ఫ్లాప్.. ఇప్పుడు హిట్.. రీ- రిలీజ్‌లో రూ.30 కోట్లు కొల్లగొట్టిన సినిమా…
హీరోయినే అవలేదు.. అప్పుడే రూ.కోట్లకు కోట్లు, మాల్ ఓపెనింగ్‌లు..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

