Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోయినే అవలేదు.. అప్పుడే రూ.కోట్లకు కోట్లు, మాల్ ఓపెనింగ్‌లు..

హీరోయినే అవలేదు.. అప్పుడే రూ.కోట్లకు కోట్లు, మాల్ ఓపెనింగ్‌లు..

Phani CH

|

Updated on: Feb 16, 2025 | 8:55 AM

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగరాజ్‌ లో జరుగుతున్న మహాకుంభమేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది మోనాలిసా భోంస్లే. అక్కడ పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకోవడానికి వచ్చి తన అందం, అమాయకత్వంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అందమైన చిరునవ్వు, ఆకట్టుకునే రూపం, తేనె కళ్లతో మోనాలిసా సోషల్ మీడియా సెన్సేషనల్ గా మారిపోయింది.

ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఓ రేంజ్‌లో వైరలయ్యాయి. ఇప్పుడు అదే క్రేజ్ తో ఒక బాలీవుడ్ సినిమాలోనూ అవకాశం సంపాదించుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తోన్న ‘ది డైరీస్ ఆఫ్ మణిపూర్’ లో మోనాలిసా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ బ్రాండ్ ఈవెంట్ కోసం స్పెషల్ ఫ్లైట్‌లో కేరళ వెళ్లింది. ఆ వీడియోలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది ఈమె. ఇటీవల నటి హనీరోజ్ ను వేధించిన కేసులో ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరు అరెస్టై బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. ఇప్పుడు అతను కేరళలో మరో బంగారు ఆభరణాల దుకాణాన్ని ప్రారంభించాడు. ఇప్పుడిదే ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా కోట్ల రూపాయిలు ఆఫర్ చేసి మరీ మోనాలిసాను పిలిచాడు బాబీ. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. ఇదే ఇవెంట్ లో రెడ్ కలర్ డ్రెస్, ఒంటినిండా ఆభరణాలతో ఎంతో అందంగా కనిపించింది మోనాలిసా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు మోనాలిసా రేంజ్ మారిపోయిందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గోల్డ్‌ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయం గమనించారా?

దువ్వాడ, దివ్వెల వారి సమర్పణలో.. వాలెంటైన్స్‌ డ్యూయెట్‌.. చూడండి ఉల్లాసంగా ఉత్సాహంగా

Brahma Anandam: బ్రహ్మానందం మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్టా ?? ఫట్టా ??

విశ్వక్‌సేన్‌ లైలా సినిమా హిట్టా? ఫట్టా? తెలియాలంటే ఈ వీడియో చూసేయండి

పసి పిల్లాడని కూడా చూడకుండా ఆటలా.. బుల్లి రాజు చేసిన తప్పేంటి ??