Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోల్డ్‌ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయం గమనించారా?

గోల్డ్‌ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయం గమనించారా?

Phani CH

|

Updated on: Feb 15, 2025 | 6:34 PM

గత కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో.. బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ కొత్త గరిష్టాల్ని నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గోల్డ్ లోన్లు తీసుకునేందుకు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే బంగారంపై లోన్లు తీసుకునేముందు ఈ విషయాలు తెలుసుకోవాలి ఇతర పర్సనల్ లోన్, వెహికిల్ లోన్, హోం లోన్‌తో పోలిస్తే..

బంగారంపైనే బ్యాంకులు, ఇతర బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల వద్ద లోన్ వేగంగా లభిస్తుందని చెప్పొచ్చు. ఇతర లోన్లతో పోలిస్తే గోల్డ్ లోన్ల వడ్డీ రేట్లు తక్కువగా ఉండటమే కాకుండా.. ఇతర నియమ నిబంధనలు కూడా సరళంగా ఉంటాయి. ఇంకా అత్యవసర సమయంలో డబ్బు అవసరం పడినప్పుడు బంగారంపై రుణం అనేది వేగంగా ఆదుకుంటుందని చెప్పొచ్చు. ఇతర లోన్లు రావాలంటే కాస్త సమయం ఎక్కువ పడుతుంది. అదే గోల్డ్‌ లోన్ల కోసం బ్యాంకులు ఎక్కువ సమయం తీసుకోవు. ఇక్కడ బంగారు ఆభరణాలు తాకట్టు పెడతారు కాబట్టి దానికి తగిన విలువతో బ్యాంకులు లోన్లు మంజూరు చేస్తాయి. గోల్డ్ లోన్లు సాధారణంగానే అధిక లోన్ టు వేల్యూ రేషియోను కలిగి ఉంటాయని చెప్పొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారం తాకట్టు పెట్టిన బంగారం విలువపై 75 శాతం వరకు రుణ మొత్తం పొందొచ్చు. ఇది బ్యాంకులు, రుణ సంస్థల్ని బట్టి మారుతుంటుంది. ఉదాహరణకు రూ.10 లక్షల విలువైన బంగారంపై రూ. 7.50 లక్షల వరకు లోన్ పొందొచ్చు. మీ అవసరాల్ని బట్టి బంగారం తాకట్టు పెట్టి లోన్ పొందొచ్చు. ఇంకా ప్రతీ లోన్‌పైనా ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. బంగారు రుణాలపై కూడా 0-2 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. దీనికి జీఎస్టీ అదనం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దువ్వాడ, దివ్వెల వారి సమర్పణలో.. వాలెంటైన్స్‌ డ్యూయెట్‌.. చూడండి ఉల్లాసంగా ఉత్సాహంగా

Brahma Anandam: బ్రహ్మానందం మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్టా ?? ఫట్టా ??

విశ్వక్‌సేన్‌ లైలా సినిమా హిట్టా? ఫట్టా? తెలియాలంటే ఈ వీడియో చూసేయండి

పసి పిల్లాడని కూడా చూడకుండా ఆటలా.. బుల్లి రాజు చేసిన తప్పేంటి ??

MS నారాయణను చివరి క్షణంలో.. అలా చూసి కన్నీళ్లు ఆగలేదు