విశ్వక్‌సేన్ లైలా సినిమా హిట్టా? ఫట్టా? తెలియాలంటే ఈ వీడియో చూసేయండి
వరసగా మాస్ సినిమాలు చేస్తున్న విశ్వక్‌సేన్ కాస్త స్టైల్ మార్చి చేసిన సినిమా ‘లైలా’. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ అమ్మాయి గెటప్ వేసాడు ఈ సినిమా కోసం. మరి ఈ లైలా ఎలా ఉంది..? యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన లైలా.. నిజంగానే యూత్‌కు ఫుల్లుగా నచ్చిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. సోను అలియాస్ విశ్వక్ సేన్ పాతబస్తీలో పేరు మోసిన ఓ బ్యూటీ పార్లర్ ఓనర్.
సోను మేకప్ వేసాడంటే ఎలాంటి అమ్మాయైనా మెరిసిపోవాల్సిందే. అందుకే సోనూ అంటే చాలు ఆ ఏరియాలో అమ్మాయిలు, ఆంటీలు అంతా పడి చచ్చిపోతుంటారు. మరోవైపు సోనూకు ఆ పార్లర్ అంటే కేవలం బిజినెస్ మాత్రమే కాదు.. తన తల్లి జ్ఞాపకం. చిన్నప్పుడు అమ్మ అలియాస్ కీర్తి చావ్లా ఎంతో కష్టపడి ఆ పార్లర్‌ను సోనూకు ఇస్తుంది. అలాంటి పార్లర్ జోలికి ఎవరొచ్చినా కూడా తాట తీస్తుంటాడు సోనూ. అలా సాగిపోతున్న సోనూ లైఫ్‌లోకి జిమ్ ట్రైనర్ జెన్నీ అలియాస్ ఆకాంక్ష శర్మ వస్తుంది. ఆమెను ఫస్ట్ లుక్‌లోనే చూసి ప్రేమలో పడతాడు సోనూ. మరోవైపు SI శంకర్ అలియాస్ బబ్లూ పృథ్వీరాజ్‌ను తన ఇద్దరు భార్యల దగ్గర రెడ్ హ్యాండెడ్‌గా పట్టిస్తాడు సోనూ. అది మనసులో పెట్టుకుని సోనూను చంపేయాలని తిరుగుతుంటాడు శంకర్. ఇక సోను మేకప్ వేసిన ఒక అమ్మాయిని చూసి రుస్తుం అలియాస్ అభిమన్యు సింగ్ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమె నల్లగా ఉందని తెలిసి సోనుపై పగ పెంచుకుంటాడు. ఇదే సమయంలో తన పార్లర్‌కు వచ్చే ఓ మహిళ కస్టమర్‌కు ఆయిల్ బిజినెస్‌కు హెల్ప్ చేస్తాడు. అదే ఇతన్ని ఆయిల్ కేసులో ఇరికిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ.. హీరోలు లేడీ గెటప్ వేయడం ఇదేం కొత్తకాదు.. ఎప్పట్నుంచో ఉన్న ఆనవాయితే. కథ బాగుంటే అమ్మాయిగా మారిపోవడానికి కూడా ఓకే అంటారు మన హీరోలు. కానీ అది కథ బాగున్నపుడే.. అలా కాకుండా కేవలం గెటప్ కోసమే సినిమా తీస్తే అదెలా ఉంటుందో లైలాను చూస్తే అర్థమవుతుంది. విశ్వక్ సేన్ అంటే మనకు మాస్ సినిమాలే గుర్తుకొస్తాయి.. కానీ లైలాలో తనను తాను కొత్తగా చూపించుకోవాలని ఫిక్సైపోయి ఈ సినిమా చేసాడని అర్థమవుతుంది. కాకపోతే కథ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండుంటే బాగుండేది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పసి పిల్లాడని కూడా చూడకుండా ఆటలా.. బుల్లి రాజు చేసిన తప్పేంటి ??
MS నారాయణను చివరి క్షణంలో.. అలా చూసి కన్నీళ్లు ఆగలేదు
సాయి పల్లవితో కలిసి.. డ్యాన్స్ అదరగొట్టిన అల్లు అరవింద్
Manchu manoj: రెచ్చగొట్టేలా మాటలు.. మనోజ్ చేసింది తప్పా ?? ఒప్పా ??
Upasana Konidela: వాలెంటైన్స్ డే కు.. సరికొత్త అర్థం చెప్పిన ఉపాసన
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

