సాయి పల్లవితో కలిసి.. డ్యాన్స్ అదరగొట్టిన అల్లు అరవింద్
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నారు. చైతూ ప్రధాన పాత్రలో నటించిన తండేల్ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో భారీగా వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజే ఈ సినిమా రూ.21.27 కోట్లు రాబట్టింది.
విడుదలై వారం రోజులు గడిచినప్పటికీ బాక్సాఫీస్ వద్ద తండేల్ జోరు తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ మూవీ వంద కోట్ల మార్క్ దిశగా పరుగు పెడుతోంది. దీంతో ఇప్పుడు తండేల్ చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్లలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో గ్రాండ్ గా సక్సెస్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ ఈవెంట్లోనే సాయి పల్లవి నాగ చైతన్య తో పాటు.. అల్లు అరవింద్ డాన్స్ చేయడం ఇప్పుడు నెట్టింట వైరల్ టాపిక్ అయిపోయింది. ఎస్ ! తాజాగా ఈ సినిమా టీమ్ శ్రీకాకుళంలో సందడి చేసింది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా ఏర్పాటు చేసిన వేడుకలో చిత్రయూనిట్ పాల్గొంది. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. ఇక వేదికపై హైలెస్సా.. హైలెస్సా అంటూ సాగే పాటకు సాయి పల్లవితో కలిసి అల్లు అరవింద్ డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. గతంలోనూ తండేల్ మూవీ ఈవెంట్లలో సాయి పల్లవితో కలిసి స్టెప్పులేశారు అల్లు అరవింద్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Manchu manoj: రెచ్చగొట్టేలా మాటలు.. మనోజ్ చేసింది తప్పా ?? ఒప్పా ??
Upasana Konidela: వాలెంటైన్స్ డే కు.. సరికొత్త అర్థం చెప్పిన ఉపాసన

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
