MS నారాయణను చివరి క్షణంలో.. అలా చూసి కన్నీళ్లు ఆగలేదు
టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మానందం! దశాబ్దాల సినీప్రయాణంలో ఇప్పటివరకు 1200కి పైగా చిత్రాల్లో నటించి.. తన కామెడీ టైమింగ్, యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్లతో ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు. అద్భుతమైన నటనతో జనాలను కన్నీళ్లు పెట్టించాడు. అత్యధికంగా సినిమాల్లో నటించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నాడు.
ఇప్పటికీ సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ వెండితెరపై సందడి చేస్తున్నారు బ్రహ్మానందం. తాజాగా తన కుమారుడు గౌతమ్ తో కలిసి బ్రహ్మా ఆనందం అనే సినిమాలో నటించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు బ్రహ్మానందం. ఈ క్రమంలోనే తన స్నేహితుడు ఎమ్మెస్ నారాయణను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాల గురించి, సినీ ప్రయాణం గురించి ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చిన బ్రహ్మానందం.. తన మిత్రుడు.. కో స్టార్ ఎమ్మెస్ నారాయణ చివరి రోజులను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. డెత్ బెడ్ పై ఎన్నో ఆలోచనలు బ్రెయిన్ లో తిరుగుతూ ఉంటాయని చెప్పిన బ్రహ్మానందం… ఎమ్మెస్ నారాయణకి ఆ విషయం తెలుసంటూ చెప్పారు. అందుకే అన్నట్టుగా.. చెప్పలేని.. నోటితో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా కూడా… బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉందంటూ తన కూతురు ద్వారా తెల్ల కాగితం మీద రాశారన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సాయి పల్లవితో కలిసి.. డ్యాన్స్ అదరగొట్టిన అల్లు అరవింద్
Manchu manoj: రెచ్చగొట్టేలా మాటలు.. మనోజ్ చేసింది తప్పా ?? ఒప్పా ??
Upasana Konidela: వాలెంటైన్స్ డే కు.. సరికొత్త అర్థం చెప్పిన ఉపాసన
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్టాప్లు పేలుతున్నాయ్గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

