Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసి పిల్లాడని కూడా చూడకుండా ఆటలా.. బుల్లి రాజు చేసిన తప్పేంటి ??

పసి పిల్లాడని కూడా చూడకుండా ఆటలా.. బుల్లి రాజు చేసిన తప్పేంటి ??

Phani CH

|

Updated on: Feb 15, 2025 | 1:52 PM

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. తెలుగువాళ్లు ఉన్న ప్రతీ చోటా క్రేజ్ తెచ్చుకున్నాడు బుల్లి రాజు అలియాస్ రేవంత్ భీమాల. అయితే ఈ బుడ్డోడికి వచ్చిన ఈ క్రేజ్‌ను గమనించిన కొంత మంది ఫేక్ గాళ్లు...ఈ చిన్నోడి పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తున్నారు. రాజకీయపరమైన పోస్టులు పెడుతున్నారు. బుల్లి రాజు క్రేజ్‌ను దుర్వినియోగం చేస్తున్నారు.

ఇక ఇది గమనించిన బుల్లి రాజు తండ్రి అందరికీ క్లారిటీ ఇచ్చారు. దాంతో పాటే ఈ ఫేక్ అకౌంట్ల పై పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇక బుల్లి రాజు అసలు పేరు రేవంత్‌ భీమల. భీమవరంలో పుట్టిన ఈ బుడ్డోడు.. ఇప్పుడు త్రూ అవుట్ వరల్డ్ పాపులర్ అయిపోయాడు. అందులోనూ తెలుగు టూ స్టేట్స్‌లో అయితే స్టార్ అయిపోయాడు. సంక్రాంతి వస్తున్నాం సినిమాలో తను చేసిన పెర్ఫార్మెన్స్‌తో.. సినిమాకే హైలెట్ అయిపోయాడు. దీంతో ఈ చిన్నోడికి సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలతో … ఫేక్ పోస్టులతో ఇబ్బందులు మాత్రమే కాదు.. బయట కూడా కొత్త కష్టాలొచ్చిపడుతున్నాయి. ఆఫ్టర్ సంక్రాంతి రిలీజ్‌.. ఈ చిన్నోడిని చూసేందుకు ఫోటోలు దిగేందుకు.. అందరూ పోటీ పడుతున్నారు. బుల్లి రాజు కనిపిస్తే చాలు.. గట్టిగా పట్టుకుని ఫోటోలు దిగుతూ విసిగిస్తున్నారు. ఆ చిన్నోడిని ఇబ్బంది పెడుతున్నారు. పసిపిల్లాడు అని కూడా చూడకుండా ఫోటోల కోసం ఈ చిన్నోడిని కొందరు నలిపేస్తున్నారు. అయితే అలాంటి వీడియో ఒకటి ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. పాటే పాపం బుల్లి రాజు అనే కామెంట్ నెట్టింట వస్తోంది. సెలబ్రిటీ స్టేటస్ రావడమే ఈ చిన్నారి తప్పా అనే కామెంట్ కూడా కొంత మంది నుంచి సీరియస్‌గా వస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

MS నారాయణను చివరి క్షణంలో.. అలా చూసి కన్నీళ్లు ఆగలేదు

సాయి పల్లవితో కలిసి.. డ్యాన్స్ అదరగొట్టిన అల్లు అరవింద్

Manchu manoj: రెచ్చగొట్టేలా మాటలు.. మనోజ్‌ చేసింది తప్పా ?? ఒప్పా ??

Upasana Konidela: వాలెంటైన్స్ డే కు.. సరికొత్త అర్థం చెప్పిన ఉపాసన