బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే మరో డేటా ప్లాన్.. ఏకంగా ఏడాదిపాటు..వీడియో
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త కొత్త ప్లాన్లతో ప్రైవేటురంగ టెలికాం సంస్థలకు సవాలు విసురుతోంది. ఇప్పటికే లాభదాయకమైన ప్లాన్లతో లక్షలాదిమంది వినియోగదారులను తనవైపు తిప్పుకున్న బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా మరో అదిరిపోయే రీచార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ సరికొత్త డేటా ప్లాన్ ను కేవలం రూ. 1515తో రీఛార్జ్ చేసుకుంటే చాలు ఏడాదిపాటు ప్రతిరోజు 2జీబీ ఇంటర్నెట్ పొందవచ్చు. అయితే ఇది కేవలం డేటా వోచర్ మాత్రమే. అంటే.. ఈ ప్లాన్‌లో ఫోన్‌కాల్, ఎస్ఎంఎస్ వంటి ఇతర బెనిఫిట్స్ ఉండవు.
ఈ డేటా ప్లాన్ విద్యార్థులు, ఉద్యోగులు, రోజూ డేటా బ్రౌజ్ చేసేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తానికి బీఎస్ఎన్ఎల్ తన కొత్త డేటా ప్లాన్ తో గట్టి సవాల్ విసిరిందనే చెప్పాలి. ఎందుకంటే ఇంత తక్కువ ధరలో ఏడాది పాటు ప్రతిరోజు 2జీబీ డేటా అందించడం పెద్ద విషయమే. ఇప్పటికే ఎన్నో చౌక ప్లాన్లతో వినియోగదారులను తనవైపు తిప్పుకుంటున్న ఈ ప్రభుత్వ సంస్థ ఇప్పుడు ఈ చీప్ డేటా రీఛార్జ్ ప్లాన్ తో మరింత మంది యూజర్లను తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలాఉంటే.. తక్కువ ధరలతో కొత్త ప్లాన్లను తీసుకువస్తున్న బీఎస్ఎన్ఎల్.. కొన్ని పాత ప్లాన్లను తొలగిస్తోంది. ఇందులో భాగంగా రూ. 201, రూ. 797, రూ. 2999 వంటి రీఛార్జ్ ప్లాన్లను ఈ నెల 10 నుంచి అందుబాటులో ఉండవని ప్రకటించింది.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
