ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. రూ.8.5లక్షల కోట్లతో..
ప్రపంచ కుబేరుడు, ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ ఓపెన్‌ఏఐ పై ఫోకస్ పెట్టారు. కొంతకాలంగా మస్క్ ఈ కంపెనీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటిది తాజాగా మస్క్ ఓపెన్ ఏఐని కొనుగోలు చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. ఇందుకోసం ఓ భారీ ఆఫర్ కూడా ప్రకటించారు. ఓపెన్‌ఏఐ ని 97.4 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.8.5లక్షల కోట్లకు కొనుగోలు చేస్తామంటూ మస్క్ సహా మరికొందరు ఇన్వెస్టర్లు ప్రకటించారు.
అయితే ఈ ఆఫర్‌ను ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ బహిరంగంగానే తిరస్కరించారు. దానికి ప్రతిగా అవసరమైతే ‘ఎక్స్’నే కొనుగోలు చేస్తానంటూ మస్క్‌కు సవాల్ విసిరారు. ‘‘మీ ఆఫర్‌కు నో. కానీ, మీరు కోరుకుంటే ట్విటర్‌ను 9.74 బిలియన్ డాలర్లకు అంటే దాదాపు రూ.85వేల కోట్లకు మేమేకొనుగోలు చేస్తాం’’ అంటూ ఆల్ట్‌మన్ తన ‘ఎక్స్’ ఖాతాలో రాసుకొచ్చారు.
వైరల్ వీడియోలు
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
