Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మస్క్‌కు హై పవర్స్‌..ఉద్యోగాల్లో భారీ కోతలు!

మస్క్‌కు హై పవర్స్‌..ఉద్యోగాల్లో భారీ కోతలు!

Samatha J

|

Updated on: Feb 16, 2025 | 6:07 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎలాన్‌ మస్క్‌కు ఫుల్‌ పవర్స్‌ ఇచ్చేశారు. ట్రంప్‌ నిర్వహిస్తున్న డోజ్‌ విభాగానికి ప్రత్యేక అధికారాలు ఇస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. ట్రంప్‌ నుంచి మస్క్‌కు మరిన్ని అధికారాలు లభించడంతో అమెరికాలోని ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద సంఖ్యలో కోతలు తప్పవనిపిస్తోంది. ఇకపై ఫెడరల్‌ ఏజెన్సీలు డోజ్‌ సహకారం, సంప్రదింపుల తర్వాతే ఉద్యోగుల తొలగింపు, నియామకాలపై నిర్ణయం తీసుకోవాలని తాజా ఉత్తర్వుల్లో ట్రంప్‌ ఆదేశించారు.

 ప్రతీ ఏజెన్సీ ఉద్యోగుల తగ్గింపునకు ప్రణాళికలు చేపట్టాలని, అవసరమైన మేరకు మాత్రమే నియామకాలు చేపట్టాలని అందులో పేర్కొన్నారు. అనంతరం వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డోజ్‌ పనితీరును ట్రంప్‌ ప్రశంసించారు. దావాలను పట్టించుకోకుండా డోజ్‌ను ముందుకు తీసుకెళ్లాలని మస్క్ కు సూచించారు. ప్రభుత్వ పరంగా భారీ సంస్కరణల కోసమే ప్రజలు ఓటు వేశారని, ఆ ఫలితమే ఇప్పుడు ప్రజలకు అందబోతోందని మస్క్‌ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనని, డోజ్‌ విభాగం సాధ్యమైనంత పారదర్శకంగా పనిచేసేందుకు తాము నిరంతరం ప్రయత్నిస్తామన్నారు. వృథా ఖర్చులు, అనవసర నియామకాలను తగ్గించకపోతే అమెరికా దివాలా తీస్తుందని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

ఇది వింటేనే షాకవుతారు!ఒక నెల మొబైల్ రీఛార్జ్ ధర రూ.50,000!వీడియో

ఎలాన్‌ మస్క్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.8.5లక్షల కోట్లతో..

కూరలు కట్ చేసే చాపింగ్ బోర్డుతో భయంకర వ్యాధులు.. మరి ఏది వాడాలి?

రాత్రయితే చాలు ఆ ప్రాంతంలో రాళ్ల వర్షం.. అంతు చిక్కని మిస్టరీ వీడియో