Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూరలు కట్ చేసే చాపింగ్ బోర్డుతో భయంకర వ్యాధులు.. మరి ఏది వాడాలి?

కూరలు కట్ చేసే చాపింగ్ బోర్డుతో భయంకర వ్యాధులు.. మరి ఏది వాడాలి?

Samatha J

|

Updated on: Feb 15, 2025 | 9:02 PM

మీ ఇంట్లో పిల్లలు తరచూ అనారోగ్యం పాలవుతున్నారా? మీకు కూడా భోజనం తర్వాత అసౌకర్యంగా అనిపిస్తోందా? అయితే వెంటనే అలర్టవ్వండి. కిచెన్ లో మీరు చేసే చిన్న పొరపాట్లే ప్రాణాంతకంగా మారవచ్చు. మీరు వినియోగిస్తున్న చాపింగ్ బోర్డులు మీ ఆరోగ్యాన్ని లోలోపల తినేస్తున్నాయని మీకు తెలుసా? తాజా అధ్యయనాలు ఇవే చెప్తున్నాయి. ప్లాస్టింగ్ చాపింగ్ బోర్డులు మంచివి కావనే వార్తలు రావడంతో అంతా సహజంగానే చెక్క చాపింగ్ బోర్డులకు మారిపోయారు. కానీ, ఇవి ఇంకా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఇందుకోసం వాడే కలప ఏదైనా రంధ్రాలతో ఉంటుంది.

 మనం టమాటోలు, పచ్చిమిర్చి, చికెన్, వెల్లుల్లి వంటివి వీటిపై తరిగినప్పుడు అందులోని సారాన్ని ఇవి సులభంగా గ్రహిస్తాయి. ఆ తర్వాత వీటిలో వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరగడం మొదలవుతుంది. ఇక వాటిపై కొంతకాలం తర్వాత పగుళ్లు, గీతలు పడ్డప్పుడు ఆ చిన్న ముక్కలు కాస్తా ఆహరంలో కలుస్తాయి. వీటిని తినడం వల్ల మన జీర్ణవ్యవస్థ ప్రమాకర వ్యాధుల బారిన పడుతుందని వైద్యులు చెప్తున్నారు. సరిగ్గా శుభ్రం చేయని చాపింగ్ బోర్డుల కారణంగా ఇ కోలి, సాల్మొనెల్లా వంటి ప్రాణాంతక బ్యాక్టీరియాలు తయారవుతాయట. ఇవి పొట్టలోకి వెళితే వెంటనే విరేచనాలు, వాంతులు, ఇన్ఫెక్షన్లు మొదలవుతాయి. చిన్న పిల్లలు, వయసు పైబడిన వారిలో ఇవి ఇంకా తీవ్ర ప్రభావం చూపుతాయి. చెక్క వ్యర్థాలు లాంటివి పేగుల్లోకి ప్రవేశించి ప్రమాదాన్ని కలిగిస్తాయి. చాలా మందికి చేపలు, కూరగాయలు, మాంసం వంటివి ఒకే బోర్డు మీద కోసే అలవాటు ఉంటుంది. కానీ ఇది చాలా హానికరం అంటున్నారు. వీటి ద్వారా బ్యాక్టీరియా మరింత సులభంగా పేగుల్లోకి వెళ్లి అనారోగ్యం కలిగిస్తుంది.