మరణించినా .. ప్రాణదాతగా నిలిచిన యువ డాక్టర్..!వీడియో
మరణానంతరం కూడా జీవిస్తోంది శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఓ యువ డాక్టర్. అవయవ దానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగులో నింపేందుకు పెద్ద మనసుతో ముందుకు వచ్చిన ఆ కుటుంబానికి సెల్యూట్ చేస్తోంది యావత్ సమాజం. అలా మరణంలోనూ యువ డాక్టర్ భూమికా రెడ్డి ప్రాణదాత అయ్యారు. డాక్టరై ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో వైద్య వృత్తి ఎంచుకున్న ఓ యువ డాక్టర్.. తన మరణంలోను ప్రాణదాతగా నిలిచింది. శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం నంగివాండ్లపల్లికి చెందిన భూమికారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు.
ఫిబ్రవరి 1వ తేదీన ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో డాక్టర్ భూమిక రెడ్డి తీవ్ర గాయాల పాలయ్యారు. వారం రోజులు మృత్యుతో పోరాడిన డాక్టర్ భూమికారెడ్డి.. చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచారు. తాను మరణిస్తే అవయవదానం చేసి పలువురు ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు, స్నేహితులకు చెప్పిన డాక్టర్ భూమికా రెడ్డి.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తల్లిదండ్రులకు తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక్కగానొక్క కుమార్తెను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో కూడా డాక్టర్ భూమికా రెడ్డి తల్లిదండ్రులైన నందకుమార్ రెడ్డి, లోహిత దంపతులు తమ బిడ్డ కోరిక తీర్చాలనుకుని అవయవదానానికి అంగీకరించారు. అలా భూమికా రెడ్డి ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, కిడ్నీలను వేర్వేరు ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్న రోగుల కోసం అవయవదానం చేశారు.

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..

వారానికి 90 గంటల పని.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్‌కి ఎవరైనా అదరహో అనాల్సిందే
