ఆఫీసుకి రోజూ 700 కి.మీ వెళ్ళొస్తుంది! ఎందులోనో తెలుసా
సాధారణంగా మనం ఆఫీసుకి బస్సులోనో కార్లోనో వెళతాం. రోజుకి ఓ 20 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తాం. కానీ మలేసియాలో ఉంటున్న ఓ భారత సంతతి మహిళ రోజూ 700 కిలోమీటర్లు ప్రయాణించడం అది కూడా విమానంలో అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. గత కొన్ని రోజులుగా ఆమె ఇలానే వెళ్లొస్తోంది. అందుకే ఆమెకు సూపర్ కమ్యూటర్ అనే టైటిల్ కూడా ఇచ్చింది ప్రభుత్వం.
సాధారణంగా మనం ఆఫీసుకి బస్సులోనో కార్లోనో వెళతాం. రోజుకి ఓ 20 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తాం. కానీ మలేసియాలో ఉంటున్న ఓ భారత సంతతి మహిళ రోజూ 700 కిలోమీటర్లు ప్రయాణించడం అది కూడా విమానంలో అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. గత కొన్ని రోజులుగా ఆమె ఇలానే వెళ్లొస్తోంది. అందుకే ఆమెకు సూపర్ కమ్యూటర్ అనే టైటిల్ కూడా ఇచ్చింది ప్రభుత్వం. వారంలో ఐదు రోజులు విమానంలో డ్యూటీకి వెళుతున్న ఆమె పేరు రేచల్ కౌర్. ఎయిర్ ఏసియా సంస్థలో ఫైనాన్స్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుందామె. సీఎన్‌ఏ ఇన్‌సైడర్ అనే ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చినప్పటి నుంచి ఆమె పేరు సోషల్‌మీడియాలో మార్మోగిపోతోంది. ఇంత ప్రయాణం, విధులు నిర్వహిస్తున్నా.. ఇంట్లో పిల్లలతో ఆనందంగా గడపగలుగుతున్నానని చెబుతోంది రేచల్. రేచల్ కౌర్‌కు 11, 12 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. అంతా కలిసి మలేసియాలోని పెనాంగ్‌లో నివాసం ఉంటున్నారు. రేచెల్ మాత్రం కౌలాలంపూర్‌లో ఆఫీసుకి వెళ్లి రావల్సిన పరిస్థితి. గతంలో ఆఫీసుకు దగ్గర్లోనే రేచల్ అద్దెకుండేవారు. పిల్లల్ని చూడ్డానికి వారానికి ఒక్కరోజే వీలయ్యేది. దీంతో తన నిర్ణయాన్ని ఆమె మార్చుకున్నారు. విమాన ప్రయాణాన్ని ప్రారంభించారు. దీని కోసం ఉదయం 4 గంటలకే నిద్ర లేచి 5 గంటలకల్లా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని 5.55 గంటలకు విమానం ఎక్కుతారు. ఉదయం 7.45 గంటలకల్లా ఆఫీసుకు చేరుకుని డ్యూటీ ముగించుకుని రాత్రి మళ్లీ 8 గంటలకల్లా ఇంటికి చేరుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: నిజమే.. చరణ్ వాచ్ రేటుతో.. హైదరాబాద్ లో ఇల్లే కొనేయచ్చు!
‘ఈ హీరోకు ఏమైంది.. స్టార్ హీరోయిన్లు తీరు మార్చుకోవాలి’
Ram Charan: బయటికి వచ్చిన క్లింకార వీడియో.. నెట్టింట వైరల్
అప్పుడు ఫ్లాప్.. ఇప్పుడు హిట్.. రీ- రిలీజ్‌లో రూ.30 కోట్లు కొల్లగొట్టిన సినిమా…
హీరోయినే అవలేదు.. అప్పుడే రూ.కోట్లకు కోట్లు, మాల్ ఓపెనింగ్‌లు..

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
