Ram Charan: నిజమే.. చరణ్ వాచ్ రేటుతో.. హైదరాబాద్ లో ఇల్లే కొనేయచ్చు!
మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చిరుత సినిమాతో హీరోగా పరిచయమైన చరణ్.. రంగస్థలం సినిమాతో నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఇందులో చరణ్ యాక్టింగ్ స్కిల్స్ చూసి ఆడియన్స్, విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు.
ఇక ఆ తర్వాత డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చరణ్ పేరు మారుమోగింది. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. చరణ్ లైఫ్ స్టైల్ గురించి నెట్టింట ఎప్పుడూ పెద్ద చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే చరణ్ పెట్టుకున్న ఓ వాచ్ ఇప్పుడు అందరి అటెన్షన్‌ను గ్రాబ్ చేసింది. ఇక చరణ్ ఫ్యాషన్, అద్భుతమైన శైలితోపాటు ఆటో మొబైల్స్, హై ఎండ్ రిస్ట్ వాచ్‌లపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. అందులోనూ చరణ్ తన వాచ్ కలెక్షన్ తో ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ అవుతుంటాడు. అయితే ఇటీవల ఓ వెకేషన్ కు వెళ్లిన చరణ్ అద్భుతమైన రోలెక్స్ ఓయిస్టర్ పెర్పెచువల్ డే-డేట్ 36 ను ధరించి కనిపించాడు. ది ఇండియన్ హోరాలజీ ప్రకారం.. ఈ ప్రత్యేకమైన టైమ్‌పీస్ మార్కెట్ ధర రూ. 2.19 కోట్లు! ఈ విషయం తెలిసి ఈ ధరతో హైదరాబాద్ లో హైఫై ఇల్లు కొనొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఈ హీరోకు ఏమైంది.. స్టార్ హీరోయిన్లు తీరు మార్చుకోవాలి’
Ram Charan: బయటికి వచ్చిన క్లింకార వీడియో.. నెట్టింట వైరల్
అప్పుడు ఫ్లాప్.. ఇప్పుడు హిట్.. రీ- రిలీజ్‌లో రూ.30 కోట్లు కొల్లగొట్టిన సినిమా…
హీరోయినే అవలేదు.. అప్పుడే రూ.కోట్లకు కోట్లు, మాల్ ఓపెనింగ్‌లు..

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
