Ram Charan: బయటికి వచ్చిన క్లింకార వీడియో.. నెట్టింట వైరల్
మెగా ప్రిన్సెస్ క్లింకార కొణిదెల ముఖాన్ని చూడడానికి మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రామ్ చరణ్- ఉపాసన ఇప్పటివరకు తమ కూతురి ఫేస్‌ను కుటుంబ సభ్యులకు తప్ప మరెవరికీ చూపించలేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తమ బిడ్డ ఫొటోలు షేర్ చేసినా ముఖం కనిపించకుండా బ్లర్ చేయడం లేదా ఎమోజీలతో ఫేస్ కవర్ చేయడం లాంటివి చేస్తున్నారు.
ఇక ఇటీవల ఆహా బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోకు హాజరైన రామ్ చరణ్ తనను నాన్న అని పిలిచిన తర్వాతే క్లింకార ఫేస్ ను అందరికీ చూపిస్తానన్నాడు. అయితే ఈ చర్చ జరిగి సరిగ్గా నెల రోజులు కూడా గడవకముందే మెగా ప్రిన్సెస్ క్లింకార ఫేస్ రివీలైంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. రామ్ చరణ్ తన కూతురిని ఎత్తుకొని నిల్చున్న వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అవి కాస్తా క్షణాల్లోనే వైరల్ గా మారాయి. వీటిని చూసిన మెగాభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. క్లింకార సూపర్ క్యూట్ గా ఉందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై పూర్తిగా దృష్టి సారించాడు. గతంలో ‘ఉప్పెన’ వంటి అద్భుతమైన ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించిన సుకుమార్ శిష్యుడు, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పుడు ఫ్లాప్.. ఇప్పుడు హిట్.. రీ- రిలీజ్‌లో రూ.30 కోట్లు కొల్లగొట్టిన సినిమా…
హీరోయినే అవలేదు.. అప్పుడే రూ.కోట్లకు కోట్లు, మాల్ ఓపెనింగ్‌లు..

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..

వారానికి 90 గంటల పని.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్‌కి ఎవరైనా అదరహో అనాల్సిందే
