శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్!వీడియో
మహాశివరాత్రి అంటే శివ భక్తులంతా భక్తి పారావస్యంలో మునిగితేలుతారు. అలాంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంటే ఇక భక్తులకు పండగే. తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలానికి భక్తులు తరలివస్తారు. ఎందుకంటే ఇటు శక్తి పీఠాలు, అటు జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రముఖమైనది శ్రీశైలం క్షేత్రం.
అంతేకాదు ఒకే చోట శక్తి పీఠము జ్యోతిర్లింగము కొలువైన ప్రదేశం కావడంతో శ్రీశైలానికి ఇసుకేస్తే రాలనంతగా భక్తజనం తరలివస్తారు. అటువంటి మహా శివరాత్రి ఏర్పాట్లపై ఏకంగా మంత్రుల బృందం శ్రీశైలం వచ్చి సమీక్షించింది. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని ఆదేశించింది. అంతేకాదు మొట్టమొదటిసారిగా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైలం వచ్చే భక్తులకు మంత్రుల బృందం గుడ్ న్యూస్ చెప్పింది. మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో నాలుగు రోజులపాటు అంటే ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు భక్తులకు ఉచితంగానే లడ్డు ప్రసాదం అందించనున్నారు.
వైరల్ వీడియోలు

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
