ఇది వింటేనే షాకవుతారు!ఒక నెల మొబైల్ రీఛార్జ్ ధర రూ.50,000!వీడియో
సెన్సార్‌షిప్ కారణంగా పాకిస్తాన్‌లో ఇంటర్నెట్ వేగం తగ్గడం అనేది సమస్యగా మారుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం జలాంతర్గామి కేబుల్స్ కత్తిరించడం వల్ల ఇంటర్నెట్ వేగం తగ్గిందని చెబుతోంది. ఇంటర్నెట్ వేగం సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం ఉపగ్రహ ఇంటర్నెట్ సేవను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్‌లో త్వరలో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలకు ఆమోదం లభించవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వం శాటిలైట్ ఇంటర్నెట్‌ను ఆమోదిస్తే, ఆ తర్వాత సాధారణ పాకిస్తానీ ప్రజలు దానిని ఉపయోగించగలరా అనే ప్రశ్న తలెత్తుతోంది.
పాకిస్తాన్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్‌లింక్ పాకిస్తాన్‌లో అందుబాటులోకి వస్తోంది. అయితే, ఇప్పుడు దాని ధర బయటకు వచ్చింది. శాటిలైట్ మొబైల్ ప్యాకేజీ ధర అక్షరాల 50 వేల రూపాయలు. ఈ ధరలో 50-250 Mbps వేగంతో ప్యాకేజ్ వస్తుంది. అయితే దీని హార్డ్‌వేర్ కోసం 120,000 పాకిస్తానీ రూపాయలు విడిగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరకు ఓ మంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక రెసిడెన్షియల్ ప్యాకేజీ ప్లాన్ విషయానికొస్తే.. దాని నెలవారీ ధర 35 వేలు పాకిస్తాన్ రూపాయలు. దాని హార్డ్‌వేర్‌పై ఒకేసారి దాదాపు 1,10,000 రూపాయలు పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఎలన్ మస్క్ ఉపగ్రహ ఇంటర్నెట్ బిజినెస్ ప్యాకేజీ ధర నెలకు 95 వేల రూపాయలు. ఈ ప్లాన్‌లో 100-500 Mbps వేగాన్ని అందుకుంటారు అయితే హార్డ్‌వేర్‌పై 2,20,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
