బ్రిటన్‌లో భారత అక్రమ వలసదారులు అరెస్ట్ వీడియో
అమెరికా మాదిరిగానే అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోన్న బ్రిటన్ ప్రభుత్వం.. ప్రధానంగా భారతీయ రెస్టరంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘యూకే వైడ్ బ్లిట్జ్’ పేరుతో వలసదారులు పని చేసే భారత రెస్టరంట్లలో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. వీటితో పాటు కార్ వాష్ ఏరియాలు, కన్వీనియెన్స్ స్టోర్‌లు, బార్‌లపై తనిఖీలు చేపట్టి వందల మందిని అరెస్టు చేసింది. హంబర్‌సైడ్ ప్రాంతంలోని ఓ భారతీయ రెస్టరంట్‌లో జరిపిన సోదాల్లో చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న ఏడుగురిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు.
మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సౌత్ లండన్‌లోని ఓ భారతీయ గ్రాసరీ వేర్‌హౌస్‌లో తనిఖీలు జరిపి ఆరుగురిని అరెస్టు చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు బ్రిటన్ హోంశాఖ అధికారులు తెలిపారు.చట్టాలను ఉల్లంఘించి వలసదారులకు అక్రమంగా ఉపాధి కల్పించే చర్యలను అడ్డుకోవడం కోసమే ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు యూకే సర్కారు తెలిపింది. ఈ క్రమంలోనే జనవరిలో దాదాపు 828 ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టి.. 609 మంది అక్రమంగా పనిచేస్తున్న వారిని అరెస్టు చేశారు. అటు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఈ వ్యవహారంపై సోమవారం స్పందించారు. ‘బ్రిటన్‌లో అక్రమ వలసలు పెరిగాయి.చాలామంది అక్రమంగా ఇక్కడ పని చేస్తున్నారు. ఈ చట్ట వ్యతిరేక వలసలను ముగిస్తాం అని ప్రధాని అన్నారు.

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
