తన అభిమాన హీరోకు రూ.72 కోట్ల ఆస్తిని రాసిచ్చిన వీరాభిమాని వీడియో
సినీ హీరోలకు అభిమానులు కోట్లలో ఉంటారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే వారి హడావిడి అంతా ఇంతా కాదు. థియేటర్ల దగ్గర భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తారు. పాలాభిషేకాలు చేస్తారు. ఇదొకరకమైన అభిమానం అయితే.. కొందరు తమ కుటుంబ సభ్యులకంటే కూడా ఎక్కువగా ఈ హీరోలను అభిమానిస్తుంటారు. కానీ, తాను అభిమానించే హీరోకు ఏకంగా కోట్ల రూపాయల విలువైన ఆస్తులను రాసివ్వడం ఎప్పుడైనా విన్నారా...? అవును ఓ అభిమాని తన అభిమాన హీరోకి ఏకంగా కోట్ల విలువైన ఆస్తిని రాసిచ్చారు. విషయం తెలిసిన ఆ హీరో చలించిపోయారు.
ముంబైకి చెందిన నిషా పాటిల్ కు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అంటే విపరీతమైన అభిమానం. తొలి నుంచి కూడా ఆయనను ఎంతగానో అభిమానిస్తోంది. ఆయన ప్రతి సినిమాను లెక్కలేనన్ని సార్లు చూసింది. ఇటీవలే ఆమె కన్నుమూసింది. ఆమె వయసు 62 సంవత్సరాలు కాగా… ఆమె పేరిట దాదాపు రూ. 72 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. తనకు చివరి రోజులు దగ్గర పడుతున్నాయనే విషయాన్ని గ్రహించిన నిషా పాటిల్.. 2018లోనే తన ఆస్తి, బ్యాంకు అకౌంట్లలో ఉన్న డబ్బు సంజయ్ దత్ కు చెందేలా వీలునామా రాయించింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె వీలునామా దస్తావేజులు సంజయ్ దత్ ఇంటికి వచ్చాయి. విషయం తెలిసిన సంజయ్ దత్ షాక్ కు గురయ్యారు. పరిచయం లేని వ్యక్తి ఆస్తి రాసివ్వడం చూసి ఆయన చలించిపోయారు. అయితే ఆ ఆస్తిని సంజయ్ దత్ తీసుకోలేదు. ఆ ఆస్తి తిరిగి ఆమె కుటుంబానికి చెందేలా చూడాలని తన లీగల్ టీమ్ కు సూచించారు. ఇంత గొప్ప అభిమానిని కలవలేకపోవడం బాధగా ఉందని చెప్పారు. కనీసం ఆమె కుటుంబ సభ్యులనైనా కలిసి కొంత ఊరట చెందుతానని అన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇది వింటేనే షాకవుతారు!ఒక నెల మొబైల్ రీఛార్జ్ ధర రూ.50,000!వీడియో
ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. రూ.8.5లక్షల కోట్లతో..
కూరలు కట్ చేసే చాపింగ్ బోర్డుతో భయంకర వ్యాధులు.. మరి ఏది వాడాలి?
రాత్రయితే చాలు ఆ ప్రాంతంలో రాళ్ల వర్షం.. అంతు చిక్కని మిస్టరీ వీడియో
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

