Bimbisara Trailer: కళ్యాణ్ రామ్ నటవిశ్వరూపం.. బింబిసారుడిని ఎదురిస్తే మరణమే.. ట్రైలర్ అదిరిపోయిందిగా..
త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. హద్దులను చేరిపేస్తే మన రాజ్యపు సరిహద్దులు ఆపై

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం బింబిసార (Bimbisara). అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నూతన దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను భారీగానే పెంచేశాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో తాజాగా బుధవారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ బింబిసార ట్రైలర్ రిలీజ్ చేశారు.
త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. హద్దులను చేరిపేస్తే మన రాజ్యపు సరిహద్దులు ఆపై రాజ్యాలను దాటి విస్తరించాలి. శరణు కోరితే ప్రాణబిక్ష.. ఎదురిస్తే మరణమే..అంటూ కళ్యాణ్ రామ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. యుద్ధ విన్యాసాలు, విజువల్స్‌తో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ట్రైలర్‌తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ నటిస్తుండగా.. కేథరిన్ కీలకపాత్రలో కనిపించనుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈనెల 29న హైదరాబాద్ శిల్పా కళా వేదికలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు.




Another peek in to the grand world of #Bimbisara. A big screen experience awaits you on August 5th. https://t.co/p1rBGLeMxu#BimbisaraOnAugust5th @NANDAMURIKALYAN @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @ChirantannBhatt @NTRArtsOfficial
— Jr NTR (@tarak9999) July 27, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
