కూల్‌గా కవ్విస్తున్న మాళవిక మోహనన్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

23 May 2026

Pic credit - Instagram

Phani Ch

మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హాట్ ఫోటోస్ తో చూపు తిప్పుకోనీడకుండా చేస్తుంది.

ప్రముఖ సినిమాటోగ్రఫర్ మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మాళవిక మోహనన్ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

2013లో 'పట్టమ్ పోలే' మూవీతో కథానాయికగా పరిచయమైంది మాళవిక మోహనన్. ఆ తర్వాత నటించిన మలయాళ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తమిళంలో పేట, మాస్టర్ వంటి చిత్రాల నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

తమిళం, మలయాళంతో పాటు బాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి ఈ మలయాళీ భామకు. బాలీవుడ్ లో వస్తున్న ‘యుద్ర’ అనే చిత్రంలో  ఒక కీలక పాత్రలో నటిస్తోంది మాళవిక మోహనన్.

తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమాలో హీరోయిన్ గా చేసింది మాళవిక. భారీ అంచనాల మధ్య విడుదలైన రాజా సాబ్ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూడాల్సి వస్తుంది.

రోజు రోజుకు ఈ బ్యూటీ గ్లామర్ డోస్ కూడా రెట్టింపు చేసి తన అందచందాలతో మైమరిపిస్తుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.