Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shamita Shetty: పెళ్లి వరకు రాకుండానే ముగిసిన ప్రేమకథ.. ఏడాదిలోనే బ్రేకప్ చెప్పుకున్న బిగ్‏బాస్ కపుల్..

మా బంధంపై స్పష్టత ఇవ్వడం ఎంతో ముఖ్యంగా భావిస్తున్నాను. రాకేశ్.. నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. గతకొంతకాలంగా మేమిద్దరం కలిసి లేము. ఇంతకాలం మీరు మాపై చూపించిన

Shamita Shetty: పెళ్లి వరకు రాకుండానే ముగిసిన ప్రేమకథ.. ఏడాదిలోనే బ్రేకప్ చెప్పుకున్న బిగ్‏బాస్ కపుల్..
Shamitha Shetty
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 27, 2022 | 4:31 PM

సినీ పరిశ్రమలో ప్రేమ… పెళ్లి.. విడాకులు చాలా కామన్ అయ్యాయి. ఓవైపు ప్రేమలో ఉన్నామంటూ ప్రకటిస్తున్న జంటలు.. మరోవైపు మూడు మూళ్ల బంధంతో ఒకటవుతున్న ప్రేమలు.. ఇంతటితో ఆగకుండా చిన్న చిన్న కారణాలతోనే విడాకులు తీసుకుంటున్న జంటలు మరికొన్ని. గత సంవత్సర కాలంగా ఇండస్ట్రీలో జరుగుతున్నది ఇదే. ఇప్పటికే అమీర్ ఖాన్, నాగచైతన్య, ధనుష్ దంపతులు విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించారు. ఇక తాజాగా బాలీవుడ్ ప్రేమజంట షమితా శెట్టి (Shamita Shetty ), రాకేశ్ బాపత్ (Raqesh Bapath) బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది షమితా.

ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొద్దిరోజులకే వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. తామిద్దరం ప్రేమలో ఉన్నామంటూ ఈ జంట గతంలోనే ప్రకటించింది. దీంతో త్వరలోనే వీరి పెళ్లి జరుగుతుందని బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాము విడిపోతున్నామంటూ మంగళవారం ఈ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ” మా బంధంపై స్పష్టత ఇవ్వడం ఎంతో ముఖ్యంగా భావిస్తున్నాను. రాకేశ్.. నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. గతకొంతకాలంగా మేమిద్దరం కలిసి లేము. ఇంతకాలం మీరు మాపై చూపించిన ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. ఇకపై కూడా ఇదే విధంగా చూపిస్తారని అనుకుంటున్నాను. మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాము” అంటూ షమితా శెట్టి, రాకేశ్ పోస్ట్ చేశారు.

బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి చెల్లెలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది షమితా శెట్టి. అతి తక్కువ సమయంలో పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో పిలిస్తే పలుకుతా సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

Shamitha Rakesh

Shamitha Rakesh

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.