AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏంటి తారక్ భయ్యా..? ఒక్క మాట కోసం 15 కిలోలా..!

‘డ్రాగన్’ సినిమా కోసం గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. కేవలం ఒక సూచనతో ఏకంగా 15 కిలోల బరువు తగ్గి, కొత్త అవతారంలో తారక్ కనిపిస్తున్నారు. ఈ అద్భుతమైన మార్పు కోసం ఆయన పడ్డ శ్రమ, ఆ వెనుక ఉన్న సవాళ్లు, దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసుకుందాం..

ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏంటి తారక్ భయ్యా..? ఒక్క మాట కోసం 15 కిలోలా..!
Jr.ntr And Prashanth Neel
Nikhil
|

Updated on: May 23, 2026 | 7:15 PM

Share

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తారక్ కొత్త లుక్, ఆ గంభీరమైన అవతారం చూసి ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. అయితే, ఈ ఫిజిక్ వెనుక ఆయన పడ్డ కష్టం, చూపిన అంకితభావం మాటల్లో చెప్పలేనిది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 15 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

15 కిలోల బరువు తగ్గేలా చేసిన ఒక్క మాట..

దాదాపు ఏడాదిన్నర క్రితం షూటింగ్ ప్రారంభానికి ముందు లుక్ టెస్ట్ జరిగినప్పుడు, పాత్రకు తగ్గట్టుగా ఎన్టీఆర్ మరింత షార్ప్‌గా కనిపిస్తే బాగుంటుందని ప్రశాంత్ నీల్ చిన్న సూచన చేశారు. “ఒక హంతకుడి (Assassin) పాత్ర కోసం నువ్వు కాస్త బక్కగా తయారైతే బాగుంటుంది” అని ప్రశాంత్ నీల్ సరదాగా అన్న మాట.. ఎన్టీఆర్ దృష్టిలో ఒక ఛాలెంజ్‌గా మారింది. ఆ ఒక్క మాట కోసం ఆయన తనను తాను మార్చుకునే ప్రక్రియ మొదలుపెట్టారు.

తారక్ ఎంతలా డెడికేటెడ్ అంటే, ప్రశాంత్ నీల్ ఎన్నిసార్లు వద్దని వారించినా ఆయన ఆగలేదు. “అతను బక్కచిక్కి, పాలిపోయినట్లు కనిపిస్తుంటే నాకు భయం వేసింది. చాలాసార్లు ఆపేయమని చెప్పాను, కానీ తారక్ వినలేదు” అని ప్రశాంత్ నీల్ ఆవేదనగా గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ పడుతున్న కష్టం చూసి ఆయన భార్య, తల్లి, స్నేహితులు మరియు టీమ్ సభ్యులందరూ దర్శకుడిపైనే ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ మార్పు వెనుక ఉన్న కష్టం చూసి తారక్ నిజంగా బాధపడ్డారని, కానీ చివరకు వచ్చిన రిజల్ట్ చూసి అంతా సంతోషించారని ప్రశాంత్ నీల్ వివరించారు.

50 రోజుల్లో 9.5 కిలోల తగ్గింపు!

కేవలం బరువు తగ్గడమే కాదు, ఒక లీన్ అండ్​ ఎజైల్ ఫిజిక్ కోసం ఎన్టీఆర్ తన బాడీని పూర్తిగా రీ-డిజైన్ చేసుకున్నారు. ఈ ప్రక్రియలో ఆయన 50 రోజుల్లోనే ఏకంగా 9.5 కిలోల మజిల్ మాస్‌ను తగ్గించుకున్నారు. దీని కోసం ఆయన తన ఫిట్‌నెస్ రొటీన్‌ను పూర్తిగా మార్చేశారు. హెవీ మజిల్-బిల్డింగ్ వర్కవుట్స్ పక్కన పెట్టి, ఫంక్షనల్ మూమెంట్స్ మరియు కార్డియో-ఫోకస్డ్ ఎక్సర్‌సైజ్‌లపై దృష్టి సారించారు.

ఎన్టీఆర్ పర్సనల్ ట్రైనర్ కుమార్ మన్నవ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ఆయన డైట్ కూడా పూర్తిగా మారింది. సాధారణంగా మజిల్ గెయిన్ కోసం హై-ప్రోటీన్ డైట్ తీసుకుంటారు, కానీ ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ ‘లో-ప్రోటీన్’ డైట్‌ను పాటించారు. ఉదయం 45 నుండి 90 నిమిషాల పాటు కార్డియో మరియు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తూ, తన శరీరాన్ని అత్యంత కఠినంగా మలుచుకున్నారు.

దర్శకుడి మాట కోసం..

“దర్శకుడు కోరుకున్నట్లుగా పర్ఫెక్ట్ అవుట్‌పుట్ రావాలంటే, నేను చేయాల్సింది చేయాల్సిందే” అన్నట్లుగా తారక్ తీసుకున్న నిర్ణయం ఆయనలోని అంకితభావానికి నిదర్శనం. షూటింగ్‌ను కొన్ని నెలల పాటు వాయిదా వేసినా, ఎన్టీఆర్ సాధించిన ఈ లుక్ సినిమాకు మేజర్ హైలైట్ కానుంది.

ఒక నటుడిగా పాత్ర కోసం ఎన్టీఆర్ పడుతున్న ఈ శ్రమ నిజంగానే అసాధారణం. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం అంటే ఇదేనేమో! పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన మార్పునైనా సాధించవచ్చని ఎన్టీఆర్ మరోసారి నిరూపించారు. ఇప్పుడు ఈ లుక్ చూశాక, ‘డ్రాగన్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Follow Us
డైరెక్టర్ మాట కోసం ప్రాణం పెట్టి శ్రమించిన ఎన్టీఆర్
డైరెక్టర్ మాట కోసం ప్రాణం పెట్టి శ్రమించిన ఎన్టీఆర్
ఈ టిప్స్‌ పాటిస్తే కేవలం 10 రోజుల్లోనే కారు నేర్చుకుంటారు..!
ఈ టిప్స్‌ పాటిస్తే కేవలం 10 రోజుల్లోనే కారు నేర్చుకుంటారు..!
ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదని ఎందుకు అంటారు? నిజం తెలుసుకో
ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదని ఎందుకు అంటారు? నిజం తెలుసుకో
150 ఎన్‌కౌంటర్ల రియల్ పోలీస్ స్టోరీ.. OTTలో ఇప్పుడు తెలుగులోనూ..
150 ఎన్‌కౌంటర్ల రియల్ పోలీస్ స్టోరీ.. OTTలో ఇప్పుడు తెలుగులోనూ..
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. మ్యాచ్ గెలిస్తేనే ప్లేఆఫ్స్ ఆశలు
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. మ్యాచ్ గెలిస్తేనే ప్లేఆఫ్స్ ఆశలు
చియా సీడ్స్ - నిమ్మరసం నీళ్లు నిజంగానే బరువు తగ్గిస్తాయా?
చియా సీడ్స్ - నిమ్మరసం నీళ్లు నిజంగానే బరువు తగ్గిస్తాయా?
: ఏసీకి తోడుగా ఫ్యాన్ ఆన్ చేస్తే జరిగే మ్యాజిక్ ఇదే..
: ఏసీకి తోడుగా ఫ్యాన్ ఆన్ చేస్తే జరిగే మ్యాజిక్ ఇదే..
పాలు, పెరుగు కలిపి తింటే ఏమవుతుంది..? ఓర్నాయనో.. పెద్ద కథే ఉందిగా
పాలు, పెరుగు కలిపి తింటే ఏమవుతుంది..? ఓర్నాయనో.. పెద్ద కథే ఉందిగా
మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందా? రూ.50 లక్షలు వస్తాయని తెలుసా?
మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందా? రూ.50 లక్షలు వస్తాయని తెలుసా?
పిల్లలు వద్దనుకోవడం నిజంగా పాపమా? అసలు నిజం ఏమిటి?
పిల్లలు వద్దనుకోవడం నిజంగా పాపమా? అసలు నిజం ఏమిటి?