AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samyuktha Menon: ‘ఆయన కళ్లల్లో పవర్ ఉంది’.. ఆ హీరోపై భీమ్లానాయక్ బ్యూటీ ప్రశంసలు..

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ తో అంచనాలు భారీగానే పెరిగిపోయాయి.

Samyuktha Menon: 'ఆయన కళ్లల్లో పవర్ ఉంది'.. ఆ హీరోపై భీమ్లానాయక్ బ్యూటీ ప్రశంసలు..
Samyuktha
Rajitha Chanti
|

Updated on: Jul 27, 2022 | 7:18 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది సంయుక్త మీనన్ (Samyuktha Menon). ప్రస్తుతం ఈ మలయాళ బ్యూటీ కళ్యాణ్ రామ్ ప్రదాన పాత్రలో తెరకెక్కుతున్న బింబిసార సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ తో అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల మీడియాతో ముచ్చటించిన హీరోయిన్ సంయుక్త మీనన్.. హీరో కళ్యాణ్ రామ్ పై ప్రశంసలు కురింపించింది.

సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. ” నేను చేసిన పాత్ర‌కు మ‌రొక‌రు డ‌బ్బింగ్ చెప్ప‌ట‌మ‌నేది నాకు ఇష్టం లేదు. రేపు నా పాత్ర‌ను నేను స్క్రీన్‌పై చూసుకున్న‌ప్పుడు దాన్ని ఓన్ చేసుకోగ‌ల‌గాలి. భాష తెలియ‌కుండా న‌టిస్తే ఆ పాత్ర‌తో ఉన్న క‌నెక్ష‌న్‌లో యాబై శాతాన్ని కోల్పోతాన‌ని భావించాను నా క్యారెక్ట‌ర్స్ విష‌యంలో నేను స్వార్థ‌ప‌రురాలిన‌నే చెప్పుకోవాలి. నా పాత్ర‌ల‌ను నేను అంతగా ప్రేమిస్తాను. అందుక‌నే నేను తెలుగు నేర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాను. మ‌నం తెలుగులో మాట్లాడిన‌ప్పుడు మ‌న‌తో ఇత‌ర యూనిట్ సభ్యుల‌కు తెలియ‌ని ఓ అనుబంధం ఏర్ప‌డుతుంది. ఆ విషయాన్ని నేను బ‌లంగా న‌మ్ముతాను. అందుక‌ని ప్రత్యేకంగా ట్యూట‌ర్‌ని పెట్టుకుని లాక్ డౌన్ స‌మయంలో తెలుగు నేర్చుకున్నాను.

ఇవి కూడా చదవండి

క‌ళ్యాణ్‌రామ్‌గారి క‌ళ్ల‌లో చాలా ప‌వ‌ర్ ఉంది. ఆయ‌న మాట‌ల కంటే ముందు క‌ళ్ల‌తోనే మాట్లాడుతారు. ఆయన్ని బింబిసారుడి పాత్ర‌లో చూడ‌గానే న‌చ్చేశారు. గంభీరంగా క‌నిపించారు. చాలా మంచి వ్య‌క్తి. షూటింగ్ అంతా పూర్త‌యిన తర్వాత న‌న్ను ప్ర‌త్యేకంగా క‌లిసి మీరు మా సినిమాలో భాగ‌మైనందుకు చాలా ఆనందంగా ఉంద‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నాకెవ‌రూ అలా చెప్ప‌లేదు. ” అంటూ చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Samyuktha (@iamsamyuktha_)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us