AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3′ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

సీజన్ 1, సీజన్ 2లతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను న‌వ్వుల్లో ముంచెత్తి భారీ విజయాలు సాధించిన అతి పెద్ద ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ సిరీస్ ‘సేవ్ ది టైగ‌ర్స్’ సిరీస్ నుంచి ఇప్పుడు సీజన్ 3 రాబోతుందని జియో హాట్ స్టార్ ప్రకటించింది. మొదటి రెండు సీజన్లలో సరదా, హాస్యం, చురుకైన డైలాగులు, రిలేషన్‌షిప్ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సిరీస్‌ మూడో సీజన్ రానుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

OTT Movie: బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ - సీజన్ 3' వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Save The Tigers Season 3
Basha Shek
|

Updated on: May 23, 2026 | 7:37 PM

Share

2023లో వచ్చిన ‘సేవ్ ది టైగర్స్’ ఫ్రాంచైజీ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాల్లో ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా రూపొందుతోన్న సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3కి మ‌హి వి.రాఘ‌వ్‌, ప్ర‌దీప్ అద్వైతం షో ర‌న్న‌ర్స్‌. ఈ సీజ‌న్ మ‌రింత అస‌క్తిక‌ర‌మైన ట్విస్టులు, కొత్త పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ‘సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3’ పోస్టర్ చూస్తుంటే కథలో ఆస‌క్తిక‌ర‌మైన కాస్మిక్ ట్విస్ట్ ఉండ‌బోతుంద‌నే విష‌యం తెలుస్తోంది. రెండు వైవిధ్య‌మైన ప్ర‌పంచాల మ‌ధ్య జ‌రిగే ప్ర‌త్యేక‌మైన సోష‌ల్ ఎక్స్‌పెరిమెంట్ క‌థ‌ను మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార్చ‌నుంది. ఈ అంశం మొత్తం క‌థ‌ను స‌రికొత్త పంథాలో ప్రేక్ష‌కుల‌ను అందించ‌నుంది. మూడు జంట‌లు.. అందులోని భ‌ర్త‌లు ప‌డే ఇబ్బందులు.. వారి చుట్టూ తిరిగే కామెడీ డ్రామాకు కాస్మిక్ ట్విస్ట్ అనేది ఎగ్జ‌యిటింగ్ కాన్సెప్ట్‌గా మారింది. ఇది క‌థ‌ను స‌రికొత్త విధానం చూపించ‌టంతో పాటు సమాజంపై అర్థవంతమైన వ్యాఖ్యానానికి కూడా అవకాశం దక్కనుంది. దీంతో ప్రేక్షకులు మ‌రోసారి నవ్వులు, రిలేషన్‌షిప్ సమస్యలు, సరదా, కామెడీ డ్రామా ఇలా అన్నీ అంశాలు క‌లిసున్న ఆల్ ఇన్ వ‌న్ ప్యాకేజ్‌గా సీజ‌న్‌3ని ఎంజాయ్ చేయొచ్చు.

సీజ‌న్‌3లో సరికొత్త స‌ర్‌ప్రైజ్‌గా వెన్నెల కిషోర్‌

ఇవి కూడా చదవండి

మొదటి రెండు సీజన్లలో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్న‌ ప్రియ‌ద‌ర్శి-జోర్దార్ సుజాత‌, కృష్ణ చైత‌న్య‌-దేవియాని శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం-పావ‌ని గంగిరెడ్డి జంట‌లు సీజన్ 3లోనూ అల‌రించ‌నున్నారు. ఇక ఈ సీజ‌న్‌3లో అందరికీ పెద్ద సర్‌ప్రైజ్‌గా వెన్నెల కిషోర్ త‌న‌దైన కామెడీతో న‌వ్వించ‌బోతున్నారు. పోస్ట‌ర్ చూస్తుంటే ఆయ‌న పాత్ర చాలా ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తోంది. వెన్నెల కిషోర్ పాత్ర క‌థ‌లో అనూహ్య‌మైన మ‌లుపులు తీసుకురావ‌ట‌మే కాకుండా, అద్భుత‌మైన కామెడీ టైమింగ్‌తో పాటు గుర్తుండిపోయేలా డ్రామ‌టిక్ పెర్ఫామెన్స్‌తో సిరీస్‌ను మ‌రింత ఎంట‌ర్‌టైనింగ్‌గా మార్చ‌బోతున్నార‌ని అభిమానులు భావిస్తున్నారు. ఈ అతిపెద్ద ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ త్వరలో జియోస్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది

మరికొన్ని రోజుల్లో జియో హాట్ స్టార్ లో సేవ్ ది టైగర్స్ సీజన్ 3

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us