AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్‌కు అమ్మగా, గోపిచంద్‌కు వదినగా చేసింది.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. ఆయన బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు , సినీ ప్రముఖులు డార్లింగ్ కు విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా నేడుడు. ఆయా సినిమాల నుంచి పోస్టర్స్ కూడా విడుదలయ్యి ఈ ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ప్రభాస్‌కు అమ్మగా, గోపిచంద్‌కు వదినగా చేసింది.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
Prabhas
Rajeev Rayala
|

Updated on: Oct 24, 2025 | 2:03 PM

Share

రెబల్ స్టార్ స్టార్ ప్రభాస్ స్పీడ్ ఇప్పట్లో తగ్గేలా లేదు. నేడు ప్రభాస్ పుట్టిన రోజు. ఆయనకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు డార్లింగ్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. సలార్, కల్కి సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్నాయి. ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే హనురాఘవాపుడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. అలాగే మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. రాజా సాబ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా హారర్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా చేస్తున్నారు. వీటితో పాటు కన్నప్ప సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రభాస్ కు అమ్మగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె ప్రభాస్ కు అమ్మగానే కాదు ఆయన ప్రాణస్నేహితుడు గోపిచంద్ కు వదినగాను నటించింది. ఆమె ఎవరో తెలుసా.? ప్రభాస్ కు అమ్మగా నటించిన హీరోయిన్ అనగానే మనకు బాహుబలిలో అనుష్క గుర్తొస్తుంది. కానీ ఆమె కాదు. మరి ఆమె ఎవరంటే.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన కళ్యాణి. అవును కళ్యాణి ప్రభాస్ కు అమ్మగా, గోపిచంద్ కు వదినగా నటించారు.

ప్రభాస్ నటించిన మున్నా సినిమా గుర్తుందా.? ఆ సినిమాలో ప్రభాస్ తండ్రిగా ప్రకాష్ రాజ్ నటించారు. ఆయన మొదటి భార్యగా కళ్యాణి నటించారు. అలా ఆమె ప్రభాస్ కు తల్లిపాత్ర చేశారు. ఇక గోపీచంద్ హీరోగా నటించిన లక్ష్యం సినిమాలో ఆయన వదినగా జగపతి బాబు భార్యగా నటించారు కళ్యాణి . ఇక కళ్యాణి ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేశారు.. ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యారు. కాగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆమె అడపదడపా సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి
Prabhas, Gopichand

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?