Mass Jathara : మాస్ జాతర సినిమాకు రవితేజ, శ్రీలీల ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా.. ?
హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు మాస్ మహారాజా రవితేజ. ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రవితేజ.. ఇప్పుడు మరోసారి శ్రీలీలతో జతకట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన లేటేస్ట్ మూవీ మాస్ జాతర. అక్టోబర్ 31న ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైంది.

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటేస్ట్ మూవీ మాస్ జాతర. ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వం వహించగా.. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించింది. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా వచ్చిన ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ధమాకా హిట్ తర్వాత మరోసారి శ్రీలీల, రవితేజ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించామని ముందు నుంచి చిత్రయూనిట్ ప్రకటించింది. అలాగే టీజర్, ట్రైలర్, సాంగ్స్ సైతం ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది. అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి : ఎన్నాళ్లకు కుదిరిందయ్యో.. అప్పుడు ప్రేయసిగా. ఇప్పుడు స్పెషల్ సాంగ్లో
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు రవితేజ, శ్రీలీల మిగతా నటీనటులు తీసుకున్న పారితోషికం వివరాలు ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతున్నాయి. ఇందులో వీరిద్దరు మాత్రమే కాకుండా నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్ కీలకపాత్రలు పోషించారు. అలాగే భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా.. ఈ చిత్రానికి రూ.65 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు రవితేజ రూ.25 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు టాక్. అలాగే శ్రీలీల సైతం ఈ చిత్రాన్నికి రూ.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి : Actor : 26 అనాథాశ్రమాలు.. 46 ఉచిత పాఠశాలలు.. రియల్ లైఫ్ హీరో.. సమాజం కోసం జీవితం ఇచ్చిన హీరో..
ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో ఫుల్ ఫాంలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మాస్ జాతర చిత్రానికి రూ.8 కోట్లు అందుకున్నారని.. నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్ మిగతా నటీనటులు లక్షల్లో పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి.. సినిమాలు వదిలేసి గూగుల్ కంపెనీ సీఈఓగా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి : Actress: 150కి పైగా సీరియల్స్.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలిసే భిక్షాటన చేస్తూ ..




