AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ప్రియుడితో వైవాహిక బంధంలోకి ముద్ద మందారం సీరియల్ నటి.. పెళ్లితో ఒక్కటైన సీరియల్ యాక్టర్స్..

బుల్లితెరపై సీరియల్ నటీనటులు ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. ఇప్పటికే పలువురు యాక్టర్స్ వివాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు తాజాగా మరో జంట పెళ్లి చేసుకున్నారు. తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులకు సుపరిచితమైన అమ్మాయి తెలుగు బ్యూటీ సాండ్రా జైచంద్రన్. 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న ఆమె.. ఇప్పుడు మరోసారి కొత్త జీవితం స్టార్ట్ చేసింది.

Tollywood: ప్రియుడితో వైవాహిక బంధంలోకి ముద్ద మందారం సీరియల్ నటి.. పెళ్లితో ఒక్కటైన సీరియల్ యాక్టర్స్..
Sandra Jaichandran, Mahesh
Rajitha Chanti
|

Updated on: Oct 31, 2025 | 6:37 PM

Share

సాధారణంగా తెలుగులో సీరియల్స్ లో తెలుగమ్మాయిలు కనిపించడం చాలా తక్కువ. ఇప్పుడు ఉన్న కొద్ది మందిలో అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న తారల గురించి చెప్పక్కర్లేదు. అందులో సాండ్రా జైచంద్రన్ ఒకరు. తెలుగు సీరియల్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటివరకు దాదాపు 10కి పైగా సీరియల్స్ చేసి స్మాల్ స్క్రిన్ పై తనదైన ముద్ర వేసింది. కలవారి కోడలు సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఒకప్పుడు పాపులర్ అయిన ముద్ద మందారం సీరియల్లో నటించింది. ఈ సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మరింత ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత అనేక సీరియల్స్ చేసిన సాండ్రా.. ఇప్పుడు ఆటో విజయశాంతి సీరియల్లో నటిస్తుంది. తాజాగా సాండ్రా జైచంద్రన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి : Actress: 150కి పైగా సీరియల్స్.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలిసే భిక్షాటన చేస్తూ ..

ఈ ఏడాది అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం తన ప్రియుడిని ఫ్యాన్స్ కు పరిచయం చేసుకుంది. ఇప్పుడు తన ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. మనసిచ్చి చూడు, శుభస్య శీఘ్రం సీరియల్స్ లో హీరోగా నటించిన మహేష్ బాబు కాళిదాసుతో కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది సాండ్రా జైచంద్రన్. ఇటీవలే నిశ్చితార్థంతో తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. అలాగే ఇద్దరు కలిసి సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కలిసి తమ కెరీర్ విషయాలను పంచుకుంటున్నారు. ఇక ఇప్పుడు పెళ్లి బంధంతో వీరిద్దరు ఒక్కటయ్యారు.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి.. సినిమాలు వదిలేసి గూగుల్ కంపెనీ సీఈఓగా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?

అక్టోబర్ 30న వీరిద్దరి వివాహ వేడుక జరిగినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. సినీప్రముఖులు, సీరియల్ తారలు, అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. సాండ్రా జైచంద్రన్ కు ఇదివరకే పెళ్లి జరిగింది. 19 ఏళ్ల వయసులోనే పెళ్లి జరిగింది. కాగా.. తన భర్త మరో అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడని తెలిసి విడాకులు ఇచ్చేసింది. అప్పటి నుంచి తన కెరీర్ పై ఫోకస్ చేసిన సాండ్రా.. వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీ అయిపోయింది. ఇప్పుడు తన ప్రియుడితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి :  Actor : 26 అనాథాశ్రమాలు.. 46 ఉచిత పాఠశాలలు.. రియల్ లైఫ్ హీరో.. సమాజం కోసం జీవితం ఇచ్చిన హీరో..

ఇవి కూడా చదవండి : ఎన్నాళ్లకు కుదిరిందయ్యో.. అప్పుడు ప్రేయసిగా. ఇప్పుడు స్పెషల్ సాంగ్‏లో

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..