Anchor Suma: యాంకర్ సుమ హీరోయిన్గా చేసిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?.. హీరో ఎవరంటే..
తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకున్న టాప్ యాంకర్స్ లలో సుమ ఒకరు అని చెప్పుకోవాలి. అయితే పలు చిత్రాల్లో సహాయ నటిగా కనిపించిన సుమ.. మొదట్లో హీరోయిన్గా చేసింది. ఇక అందులో హీరోయ ఎవరో తెలిస్తే మరింత ఆశ్చర్యం తప్పదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రైటర్ కమ్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు సుమ కనకాల. బుల్లితెరపై లెజెండరి యాంకర్ సుమగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ.. ఎప్పుడూ చలాకీగా కనిపిస్తూ అడియన్స్‌ను అలరిస్తుంటుంది. ప్రస్తుతం టెలివిజన్‌లో టాప్ యాంకర్‌గా కొనసాగుతున్న సుమ.. అసలు ఇండస్ట్రీలోకి రావాలని అనుకోలేదట. తన తల్లి కోరిక ప్రకారం నటిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత హీరోయిన్.. ఇప్పుడు యాంకర్ గా మారిపోయింది. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకున్న టాప్ యాంకర్స్ లలో సుమ ఒకరు అని చెప్పుకోవాలి. అయితే పలు చిత్రాల్లో సహాయ నటిగా కనిపించిన సుమ.. మొదట్లో హీరోయిన్గా చేసింది. ఇక అందులో హీరోయ ఎవరో తెలిస్తే మరింత ఆశ్చర్యం తప్పదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రైటర్ కమ్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న వక్కంతం వంశీ ఆ సినిమాలో హీరోగా చేశారు. అదే ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ సినిమా.
దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమా తెరకెక్కింది. ఇందులో హీరోగా వక్కంతం వంశీ నటించగా.. హీరోయిన్లుగా సుమ, కావ్య నటించారు. 1996లో విడుదలైన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక ఆ తర్వాత వక్కంతం వంశీ నటనవైపు కాకుండా.. రైటర్ గా కొనసాగుతున్నారు. ఇక సుమ.. ప్రస్తుతం యాంకర్ గా ఫేమస్ అయ్యారు.

Suma
ఓవైపు సినిమాలు, సీరియల్స్ చేస్తూనే యాంకర్ గా తన ప్రయాణం ఆరంభించారు సుమ. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై టాప్ యాంకర్. సినిమాల్లో కొనసాగుతున్న సమయంలోనే సుమ.. నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి బాబు, పాప ఉన్నారు. ఇక తమ పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారని గతంలో సుమ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
