Salaar: సలార్ టీజర్‏లో ఇంట్రెడక్షన్ ఇచ్చిన నటుడిని గుర్తుపట్టారా ?.. చిరు, బాలకృష్ణ చిత్రాల్లో పవర్ ఫుల్ విలన్..

"సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా డేంజర్.. కానీ జురాసిక్ పార్క్ లో కాదు.. ఎందుకంటే అక్కడ ఉండేది డైనోసార్" అనే డైలాగ్ తో టీజర్ లో మొదటగా కనిపించిన వ్యక్తి టీనూ ఆనంద్. పాన్ ఇండియా స్టా్ర్ ప్రభాస్ తో టీనూ ఆనంద్ చేస్తోన్న రెండో సినిమా సలార్.

Salaar: సలార్ టీజర్‏లో ఇంట్రెడక్షన్ ఇచ్చిన నటుడిని గుర్తుపట్టారా ?.. చిరు, బాలకృష్ణ చిత్రాల్లో పవర్ ఫుల్ విలన్..
Salaar
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 06, 2023 | 2:57 PM

ప్రస్తుతం యూట్యాబ్‏ను షేక్ చేస్తోంది సలార్ టీజర్. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇక మొత్తం వీడియోలో ప్రభాస్ ను కేవలం 10 సెకన్ల కంటే ఎక్కువ చూపించలేదు. దీంతో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కాస్త నిరాశలోనే ఉన్నారు. కానీ.. టీజర్ మొత్తంలో సలార్ గురించి ఓ రెంజ్‏లో ఎలివేషన్స్ ఇచ్చిన నటుడు మరోసారి హైలెట్ అయ్యాడు. “సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా డేంజర్.. కానీ జురాసిక్ పార్క్ లో కాదు.. ఎందుకంటే అక్కడ ఉండేది డైనోసార్” అనే డైలాగ్ తో టీజర్ లో మొదటగా కనిపించిన వ్యక్తి టీనూ ఆనంద్. పాన్ ఇండియా స్టా్ర్ ప్రభాస్ తో టీనూ ఆనంద్ చేస్తోన్న రెండో సినిమా సలార్. గతంలో వీరిద్దరి కాంబోలో సాహో మూవీ వచ్చింది. ఇక ఇప్పుడు సలార్ చిత్రంలోనూ అతను కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. టీనూ ఆనంద్.. గతంలో తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు. నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఆదిత్య 369 చిత్రంతోపాటు.. మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి సినిమాలో భాటియా పాత్రలో కనిపించారు టీనూ ఆనంద్. అలాగే గతేడాది సూపర్ హిట్ అయిన సీతారామమ్ చిత్రంలో ఆనంద్ మెహతా పాత్రలో నటించారు. టీనూ ఆనంద్ ఫ్యామిలీ పూర్తిగా ఇండస్ట్రీకి సంబందించిన వారే. ఆయన మేనల్లుడు సిద్ధార్థ్ ఆనంద్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. పఠాన్, వార్, బ్యాంగ్ బ్యాంగ్ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు.

ఇక టీనూ ఆనంద్ తెలుగులో ఆదిత్య 369 తొలి సినిమా కాగా.. పుష్పక విమానం, అంజి, ఘటోత్కచుడు, సాహో, సీతారామమ్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు సలార్ చిత్రంలో కనిపించనున్నారు. టీనూ ఆనంద్ కేవలం నటుడు మాత్రమే కాదు.. రచయిత, దర్శకుడు కూడా. ఆయన అసలు పేరు వీరేందర్ రాజ్ ఆనంద్. టీనూ తండ్రి ఇందర్ రాజ్ ఆనంద్ సినీ రచయిత.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.