Maamannan: తెలుగులోకి వచ్చేస్తోన్న మరో తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ.. ‘మామన్నన్’ రిలీజ్ ఎప్పుడంటే..

తమిళ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం మామన్నన్. ఇందులో వడివేలు ముఖ్య పాత్రలో కనిపించారు. డైరెక్టర్ మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఎక్కువగానే వసూళ్లు రాబట్టింది. జూన్ 29న అడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉదయనిధి స్టాలిన్ కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది.

Maamannan: తెలుగులోకి వచ్చేస్తోన్న మరో తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ.. 'మామన్నన్' రిలీజ్ ఎప్పుడంటే..
Maamannan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 06, 2023 | 3:19 PM

ప్రస్తుతం తమిళం, మలయాళం, కన్నడలో భారీ విజయాన్ని అందుకున్న చిన్న సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే గుడ్ నైట్, జయ జయ జయహే, మట్టి కుస్తీ, రొమాంచమ్ వంటి చిత్రాలు తెలుగులో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఇటీవలే వీరన్ చిత్రం సైతం ఓటీటీలోకి తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇక ఇప్పుడు మరో కోలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతుంది. తమిళ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం మామన్నన్. ఇందులో వడివేలు ముఖ్య పాత్రలో కనిపించారు. డైరెక్టర్ మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఎక్కువగానే వసూళ్లు రాబట్టింది. జూన్ 29న అడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉదయనిధి స్టాలిన్ కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది.

మరోవైపు డైరెక్టర్ మారి సెల్వరాజ్ కెరీర్‏లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాను ఇప్పుడు తెలుగు అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. జూలై 14న ఈసినిమా తెలగు ప్రేక్షకుల ముందుకు రానుంది. రూ.20 కోట్ల బడ్జెట్‏తో తీసిన ఈ సినిమాకు దాదాపు వారం రోజులకు రూ. 52 కోట్ల గ్రాస్ రాబట్టింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు సురేష్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ వారు ఈ సినిమా తెలుగు స్ట్రీమింగ్ హక్కులను తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాను తెలుగులో నాయకుడు అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.