Navdeep: నవదీప్ మోకాలికి గాయం.. ఆటపట్టిస్తూ ఎంజాయ్ చేసిన తేజస్వి.. వీడియో వైరల్..

ఇటీవలే ప్రముఖ ఓటీటీ మాధ్యామం ఆహాలో న్యూసెన్స్ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇందులో బిందుమాధవి, నవదీప్ ప్రధాన పాత్రలలో నటించారు. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు నవదీప్. ఈ క్రమంలోనే అతని మోకాలికి గాయమైనట్లుగా తెలుస్తోంది. మోకాలికి ఎక్కువగా గాయమవడంతో అతను ప్రస్తుతం కర్ర సహయంతో నడుస్తున్నారు.

Navdeep: నవదీప్ మోకాలికి గాయం.. ఆటపట్టిస్తూ ఎంజాయ్ చేసిన తేజస్వి.. వీడియో వైరల్..
Navdeep
Follow us

|

Updated on: Jul 06, 2023 | 3:38 PM

జై సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన నవదీప్.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వరుసగా హిట్స్ అందుకున్న ఈ హీరో నటించిన చిత్రాలు ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో సెకండ్ హీరోగా.. సహయ నటుడిగా కనిపించారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నవదీప్… ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇటీవలే ప్రముఖ ఓటీటీ మాధ్యామం ఆహాలో న్యూసెన్స్ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇందులో బిందుమాధవి, నవదీప్ ప్రధాన పాత్రలలో నటించారు. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు నవదీప్. ఈ క్రమంలోనే అతని మోకాలికి గాయమైనట్లుగా తెలుస్తోంది. మోకాలికి ఎక్కువగా గాయమవడంతో అతను ప్రస్తుతం కర్ర సహయంతో నడుస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు నవదీప్. ఈ క్రమంలోనే అతని స్నేహితురాలు తేజస్వి ఓ ఫన్నీ వీడియో తన ఇన్ స్టాలో షేర్ చేసింది.

ఇటీవల నవదీప్ కాలికి గాయమైంది. దీంతో అతను ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడిని పరామర్శించడానికి వచ్చిన తేజస్విని.. ఆటపట్టిస్తూ పన్నీగా ఓ రీల్ చేసింది. ఆ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే కాలికి గాయంతో నవదీప్ కూర్చొని ఉండగా.. ‘నీ సుఖమే నే కోరుకున్నా.. ‘ అనే పాటకు సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుండగా.. నవదీప్ తొందరగా కోలుకోవాలంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం వీడియో ఫన్నీగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. నవదీప్, తేజస్విని మంచి స్నేహితులు. వీరిద్దరు మధ్య ఉండే బాండింగ్ గురించి ఇప్పటికే చాలా ప్లాట్ ఫామ్స్ పై చెప్పారు. ఇద్దరు కలిసి మొదటిసారి ఐస్ క్రీమ్ అనే సినిమాలో నటించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2014లో రిలీజ్ అయ్యింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం మొదలయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.