Tabu: టబు అక్క కూడా టాప్ హీరోయిన్ అని తెలుసా.. ? స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఒకప్పుడు సినిమా ప్రపంచాన్ని ఏలిన సినీతారలు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఒకటి రెండు చిత్రాలతోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న స్టార్స్.. ఇప్పుడు మాత్రం అడియన్స్ ముందుకు రావడం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి చెందినవారే. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

టబు.. పాన్ ఇండియా సినీప్రియులకు పరిచయం అవసరంలేని పేరు. తెలుగు, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగులో నాగార్జున సరసన నిన్నే పెళ్లాడతా సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హిందీలో దృశ్యం 3 సినిమాతోపాటు.. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులో కీలకపాత్ర పోషిస్తుంది. ఇదిలా ఉంటే.. టబు అక్క కూడా టాప్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ? ఆమె పేరు ఫరా నాజ్. 80వ దశకంలో తోపు యాక్టర్.
ఫరా నాజ్.. ఒకప్పుడు అందం, అభినయంతో ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్. ఫరా నాజ్.. ఇప్పుడు ఏం చేస్తుంది.. ? ఎక్కడ ఉంది.. ? నటనా ప్రపంచానికి దూరంగా ఏం చేస్తోంది.. ? విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫరా నాజ్ చిత్ర పరిశ్రమలోకి బలమైన ఎంట్రీ ఇచ్చి, తన అద్భుతమైన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. డైరెక్టర్ యష్ చోప్రా తెరకెక్కించిన ఫసాలే సినిమాతో నటన ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 80లలో వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. 2005 లో శిఖర్ సినిమా తర్వాత ఆమె మరో సినిమా చేయలేదు. 2005 నుంచి సినీరంగానికి దూరంగా ఉండిపోయింది ఫరా.

Farah Naaz
తాజా సమాచారం ప్రకారం ఫరా ప్రస్తుతం ముంబైలో తన రెండవ భర్త, చిత్ర నిర్మాత సుమిత్ సెహగల్ తో నివసిస్తుంది. భర్తతో కలిసి వ్యాపార రంగంలో బిజీగా ఉన్న ఫరా.. దక్షిణాది చిత్రాలను హిందీలోకి డబ్ చేస్తుంది. 1996లో ఫరా మొదట నటుడు విందు దారా సింగ్‌ను వివాహం చేసుకుంది. ఆరేళ్లకే వీరిద్దరి బంధం ముగిసిపోయింది. ఆ తర్వాత 2003లో సుమిత్ సెహగల్‌ను వివాహం చేసుకుంది. ఆమె 1984 నుండి 2005 వరకు చిత్ర పరిశ్రమలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.

Farah Naaz New
ఇవి కూడా చదవండి :
Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?
Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..







