Tollywood: 6 ఏళ్లకే సినిమాల్లోకి.. ఇప్పుడు దేశంలోనే టాప్ రెమ్యునరేషన్.. తల్లైనా తగ్గని టాలీవుడ్ హీరోయిన్ క్రేజ్
ఓ దిగ్గజ దర్శకుడి కూతురిగా 6 ఏళ్లకే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత మరికొన్నేళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు దేశంలోనే టాప్ మోస్ట్ యాక్ట్రెస్ గా ఎదిగింది. పెళ్లై ఓ కూతురికి తల్లైనా ఈ టాలీవుడ్ హీరోయిన్ క్రేజ్ అస్సలు తగ్గడం లేదు.

సినిమా ఇండస్ట్రీ ఉన్న నేపథ్యం కావడంతో ఈ హీరోయిన్ 6 ఏళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంట్లో బుడి బుడి అడుగులు వేయాల్సిన సమయంలో సిల్వర్ స్క్రీన్ పై దర్శనమిచ్చింది. తన క్యూట్ యాక్టింగ్ తో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసింది. ఇక తన మొదటి పారితోషికంగా ఏకంగా రూ. 15 లక్షల పారితోషికం తీసుకుందీ అందాల తార. ఇప్పుడు దేశంలోనే టాప్ మోస్ట్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటోన్న హీరోయిన్ల లిస్టు చూస్తే ఈ ముద్దుగుమ్మ పేరు ముందు వరుసలో ఉంటుంది. వయసులో దీపికా పదుకొణె, రష్మిక మందన్నా, కత్రినా కైఫ్ ల కంటే చిన్నదైనా రెమ్యునరేషన్ లో వారితో సరి సమానంగా దూసుకెళుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. సినిమా కెరీర్ ఫుల్ స్పీడ్ లో ఉన్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ మెడలో మూడు ముళ్లు వేయించుకుంది. ఓ స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది. అయితేనేం ఈ అందాల తార డిమాండ్, క్రేజ్ అసలేం తగ్గలేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? తను మరెవరో కాదు ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్.
దిగ్గజ దర్శకుడు మహేష్ భట్ కూతురైన అలియా భట్ ఆరేళ్లకే సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. 1999లో రిలీజైన సంఘర్ష్ సినిమాతో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిందీ స్టార్ కిడ్. అక్షయ్ కుమార్, ప్రీతి జింటా, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించగా, చిన్నప్పటి ప్రీతి జింటా పాత్రలో అలియా క్యూట్ యాక్టింగ్ తో అదరగొట్టింది. ఇక 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అలియా అనతి కాలంలోనే బాలీవుడ్ లో టాప్ హీరోయిన గా గుర్తింపు తెచ్చుకుంది.
అలియా భట్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను కూడా పలకరించింది అలియా భట్. ఇందులో ఆమె పోషించిన సీత పాత్రకు ప్రముఖుల ప్రశంసలు వచ్చాయి. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్ ను ప్రేమ వివాహం చేసుకున్న అలియా ఇప్పుడు తన కూతురు రాహా కపూర్ పెంపకంలో బిజీగా ఉంటోంది. అదే సమయంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ లో దూసుకెళుతోంది.
View this post on Instagram




