- Telugu News Photo Gallery Cinema photos Know This Actress Who Gave Tough Compition To Madhuri Dixit and Aishwarya Rai, a Bitter Divorce With Her Husband , She Is Karishma Kapoor
స్టార్ హీరోయిన్లకే చెమటలు పట్టించింది.. సూపర్ స్టార్ ఇంటికి కోడలిగా వెళ్లాల్సింది.. చివరకు భర్తపై..
ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ.. చిన్న వయసు నుంచే నటనపై ఆసక్తి. వరుస సినిమాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. అందం, అభినయంతో గ్లామర్ ప్రపంచంలో తనను తాను నిరూపించుకుంది. కానీ ప్రేమ పెళ్లి వరకు చేరలేదు. చివరకు వైవాహిక జీవితం సైతం సాఫీగా సాగలేదు. కట్ చేస్తే.. విడాకులు తీసుకుని ఇప్పుడు ఒంటరిగా జీవిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..
Updated on: Jul 15, 2025 | 9:32 PM

వెండితెరపై అందం, అభినయంతో కట్టిపడేసింది. ఒకప్పుడు ఆమె కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్. తనదైన నటనతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ప్రేమ పెళ్లి వరకు చేరలేదు. మరోవైపు వైవాహిక జీవితం సైతం సాఫీగా సాగలేదు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

1990లలో నటనా ప్రపంచంలో సంచలనం సృష్టించి.. అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ కరిష్మా కపూర్‍కు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. సినిమా సంప్రదాయం ఉన్న కుటుంబం నుండి వచ్చినప్పటికీ ఆమె వైవాహిక జీవితం అస్సలు విజయవంతం కాలేదు. బాలీవుడ్ సినిమాలో తన డ్యాన్స్ తో ఊర్రూతలూగించిన నటి కరిష్మా కపూర్, అనేక విజయవంతమైన చిత్రాలలో నటించింది.

కపూర్ కుటుంబంలో జన్మించిన ఆమె ఇండస్ట్రీలోకి సులభంగానే అడుగుపెట్టింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఆమె విడాకుల తర్వాత తరచుగా వార్తల్లో నిలిచింది. అప్పట్లో అభిషేక్ బచ్చన్, కరిష్మా కపూర్ ప్రేమలో ఉన్నారు. జయా బచ్చన్ సైతం వీరిద్దరి పెళ్లి జరుగుతుందని హామీ ఇచ్చింది.

కానీ వీరి పెళ్లి జరగలేదు. చివరకు ఆమె వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ని 2003లో చేసుకుంది. ఇద్దరూ 2016 లో విడిపోయారు. కరిష్మాకు సమైరా, కియాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంజయ్ కపూర్ మరణం కూడా వార్తల్లో నిలిచింది. గోల్ఫ్ ఆడుతున్నప్పుడు సంజయ్ కపూర్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు.

కానీ విడాకుల సమయంలో తన భర్తపై కరిష్మా షాకింగ్ కామెంట్స్ చేసింది. సంజయ్ కపూర్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత కరిష్మాకు ఖార్‌లో ఒక ఇల్లు, వారి పిల్లల పేరు మీద నెలకు రూ. 10 లక్షల వడ్డీకి రూ. 14 కోట్ల విలువైన బాండ్లు, రూ. 87 కోట్ల భరణం, వివాహ సమయంలో ధరించిన ఆభరణాలను ఇచ్చాడు.




