Bangalore Padma: 150కు పైగా సినిమాలు చేసిన ఈ నటి గుర్తుందా? ఆమె కూతురు కూడా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరంటే?
తెలుగులో సుమారు 150కు పైగా సినిమాల్లో నటించింది బెంగుళూరు పద్మ. హీరోలు, హీరోయిన్లకు తల్లిగా, అత్తమ్మగా ఇతర సహాయక పాత్రల్లో నటించి మెప్పించింది. పలు సీరియల్స్ లోనూ నటించి బుల్లితె ప్రేక్షకులకు చేరువైంది. అయితే పద్మ కూతురు కూడా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అని చాలా మందికి తెలియదు.

కృష్ణా జిల్లా, విజయవాడ లో జన్మించిన పద్మ నాలుగు సంవత్సరాల వయసులోనే సినీరంగంలోకి అడుగు పెట్టింది. ఆలుమగలు చిత్రంలో అల్లు రామలింగయ్య పిల్లల్లో ఓ కూతురిగా నటించింది. ఆతర్వాత బొమ్మరిల్లు అనే చిత్రంలో నూ బాలనటిగా కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ చిత్రంలో చరణ్‌రాజ్ కి సహాయనటిగా చేసింది. కూలీ నెం.1, ప్రేమించుకుందాం రా, ఆది, దొంగరాముడు అండ్ పార్టీ, మిస్సమ్మ, నేను సైతం, మాయా బజార్, సుల్తాన్, హ్యాపీడేస్, హోమం తదతర సూపర్ హిట్ సినిమాల్లోనూ వివిధ పాత్రలు పోషించింది పద్మ. తెలుగులో సుమారు 150 కు పైగా సినిమాల్లో నటించిన ఆమె అన్వేషిత,గీతాంజలి, శ్రావణమేఘాలు, అభిషేకం వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది.
కాగా ప్రముఖ రచయిత, నటుడైన అరుణ్ కుమార్ ను పెళ్లి చేసుకుంది పద్మ. వీరికి ఇద్దరు సంతానం. అబ్మాయి పేరు శ్రీనివాస్ ప్రసాద్. ఇక అమ్మాయి మన తెలుగు ఆడియెన్స్ కు బాగా పరిచయం. రామ్ చరణ్, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఆమె ఎవరో కాదు హ్యపీడేస్ ఫేమ్ అప్పు అలియాస్ గాయత్రీ రావు.
2007లో రిలీజై హ్యాపీ డేస్ సినిమా సంచలన విజయం సాధించింది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో గాయత్రీ రావు కూడా ఓ కీలక పాత్ర పోషించింది. అప్పు అనే పాత్రలో అద్భుతంగా నటించింది. ఇదే హ్యాపీ డేస్ సినిమాలో కూడా పద్మ నటించింది. నిఖిల్ కి అమ్మ పాత్రలో కనిపించింది. కాగా హ్యాపీడేస్ తర్వాత గాయత్రీకి పెద్దగా సినిమా అవకాశాలు. రామ్ చరణ్ ఆరెంజ్, పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్, ఏకలవ్య, గంగ పుత్రలు వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది.
అవకాశం వస్తే మళ్లీ నటిస్తా..
వీటి తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో 2019లో వివాహం చేసుకొని చెన్నైలో స్థిరపడిపోయింది. . ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పుటికీ.. ఫ్యామిలీ లైఫ్‌ని మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది గాయత్రీ. అవకాశాలు వస్తే.. మళ్లీ నటించేందుకు సిద్దమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

Appu Alias Gayatri Rao
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








