AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాటకు.. మాట !! టాలీవుడ్‌లో కొత్త కాంట్రవర్సీ

మాటకు.. మాట !! టాలీవుడ్‌లో కొత్త కాంట్రవర్సీ

Phani CH
|

Updated on: Oct 13, 2025 | 5:35 PM

Share

హీరో కిరణ్ అబ్బవరం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తెలుగులో తమిళ హీరోలకు ఉండే ఆదరణ.. మన హీరోలకు తమిళనాడులో ఎందుకు దక్కదన్నది ఆయన ప్రశ్న. సామాన్య ప్రేక్షకుల అభిప్రాయాల నుంచి, డిస్ట్రిబ్యూటర్ల వరకు చాలా మందిలో ఉన్న అనుమానమే ఇది. ఇటీవల ‘K Ramp’ సినిమా టీజర్ లాంఛ్ సందర్భంగా కిరణ్ ఈ వ్యాఖ్యలు చేసాడు.

ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న డ్యూడ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అంత భారీగా థియేటర్లు, హైప్ వచ్చినట్టే.. తన సినిమాకు ఎందుకు అలాంటి అవకాశం లేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆయన వ్యాఖ్యలకు ఆ మూవీ ప్రొడ్యూసర్ కూడా కాస్త ఘాటుగానే రియాక్టయ్యాడు. దీంతో కిరణ్ అబ్బవరం మైత్రీ రవి యాక్షన్ రియాక్షన్ కాస్తా టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి. లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మార్కెట్‌ తెచ్చుకున్నాడు ప్రదీప్. ఆయనొక్కడే కాదు.. శివ కార్తికేయన్‌, కార్తీ లాంటి హీరోలకు తెలుగులో క్రేజ్ పెరిగిపోతుంటే.. ఇలాంటి గ్రాండ్ రిలీజ్‌లు మన తెలుగు హీరోలకు మాత్రం తమిళనాడులో రాకపోవడం ఇండస్ట్రీలో అసంతృప్తిని పెంచుతుంది. ఇది కేవలం తెలుగు సినిమాలపై చిన్న చూపు తప్ప.. వాస్తవానికి అక్కడి థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూషన్స్‌లో కొన్ని సంస్థలు ఎంతవరకు తెలుగు సినిమాలకు అవకాశాలిస్తారన్నదానిపై ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమిళ ఇండస్ట్రీలో బేసిక్‌గానే తమ సొంత సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ తెలుగులో అలా కాదు.. అన్ని సినిమాలను ఇక్కడ ఆదరిస్తుంటారు. ఇప్పుడు కిరణ్ అడుగుతున్నది కూడా అదే. మనం వాళ్లను అంత బాగా ఆదరిస్తున్నపుడు మనల్ని ఎందుకు వాళ్లు పట్టించుకోరు అని..? గతేడాది ‘క’ సినిమా సమయంలోనే తనకు ఇది ఎదురైందని చెప్పాడు కిరణ్. ప్యాన్ ఇండియన్ రిలీజ్ అనుకున్నా కూడా.. కేవలం థియేటర్లు లేని కారణంగానే తన సినిమాను తెలుగుకే పరిమితం చేసానన్నాడు కిరణ్ అబ్బవరం. దివాళికి అందరికంటే ముందే కే ర్యాంప్ సినిమా వస్తుందని చెప్పామని.. కానీ ఇప్పుడు మరో మూడు నాలుగు సినిమాలు పోటీకి వచ్చేసాయని.. ఇప్పుడు కూడా థియేటర్స్ గోల తప్పదంటున్నాడు ఈ కుర్ర హీరో. డబ్బింగ్ సినిమాలు వచ్చినపుడు కూడా మన వాళ్లు నెత్తిన పెట్టుకుని చూసుకుంటారని చెప్పాడు కిరణ్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాంతారకు రూ.కోట్లలో కలెక్షన్స్‌ సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు

మొన్న విజయ్..నేడు రష్మిక..ఎంగేజ్మెంట్‌ రింగ్స్‌తో లవ్ బర్డ్స్

ప్రధాని మోదీకి రామ్ చరణ్‌.. స్పెషల్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్

NTRపై బాలీవుడ్ స్టార్ వివాదాస్పద వ్యాఖ్యలు !! బుద్ది చెప్పాల్సిందే

టెంపర్ సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. ఫలితం NTR ఖాతాలో దిమ్మతిరిగే హిట్