టెంపర్ సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. ఫలితం NTR ఖాతాలో దిమ్మతిరిగే హిట్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్- డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా టెంపర్. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించింది. 2015లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. వరుస ఫ్లాఫ్ లతో సతమతమవుతోన్న ఎన్టీఆర్ కెరీర్ కు బిగ్ బూస్ట్ ఇచ్చింది.
దాదాపు 35 కోట్లతో తెరకెక్కిన టెంపర్ మూవీ అప్పట్లోనే రూ.75 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఇందులో ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అవినీతి పరుడైన పోలీస్ ఆఫీసర్ దయా పాత్రలో తారక్ అదరగొట్టాడు. ‘నా పేరు దయా.. నాకు లేనిదే అది’అంటూ ఎన్టీఆర్ నోటీ నుంచి వచ్చిన పవర్ ఫుల్ డైలాగులకు థియేటర్లలో విజిల్స్ పడ్డాయి. తెలుగులో సూపర్ హిట్ అయిన టెంపర్ చిత్రాన్ని హిందీ, తమిళంలో రీమేక్ చేయగా.. అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా. హిందీలో అయితే ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాంటి ఈ సినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫస్ట్ ఛాయిస్ కాదట. మొదట టెంపర్ కథను పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కు వినిపించాడట డైరెక్టర్ పూరీ జగన్నాథ్. అయితే అప్పటికే బన్నీ సినిమా డైరీ ఫుల్ అయిపోయిందట. వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడట అల్లు అర్జున్. దీంతో తనకు కొంచెం టైమ్ పడుతుందని కుదిరితే వేరే వాళ్లతో చేయమని పూరీకి సలహా ఇచ్చాడంట బన్నీ. దీంతో పూరీ జగన్నాథ్ ఇదే కథను జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పగా వెంటనే ఒప్పేసుకున్నాడట. అలా మొత్తానికి బండ్ల గణేష్ నిర్మాణ సారథ్యంలో టెంపర్ సినిమా పట్టాలెక్కిందట. అంతేకాదు ఈ మూవీతోనే ఎన్టీఆర్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. దీని తర్వాత తారక్ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మొత్తానికి అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరస ప్రాజెక్ట్‌లతో సత్తా చూపిస్తున్న భీమ్స్
ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. మూడురోజులు భారీ వర్షాలు
పెళ్లి కాదు.. ఏకంగా హనీమూన్‌పై త్రిష పోస్ట్
Deepika Padukone: పని గంటలపై.. పెదవి విప్పిన దీపిక
టైటిల్స్ విషయంలో సీక్రసీ మెయిన్‌టైన్ చేస్తున్న మేకర్స్.. ఎందుకీ సస్పెన్స్
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

