AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: పని గంటలపై.. పెదవి విప్పిన దీపిక

Deepika Padukone: పని గంటలపై.. పెదవి విప్పిన దీపిక

Phani CH
|

Updated on: Oct 13, 2025 | 4:23 PM

Share

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొణే పేరు గత కొన్ని రోజులుగా వార్తలలో వినిపిస్తోంది. ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందిన దీపికా.. కొన్ని రోజుల క్రితం స్పిరిట్, కల్కి 2 ప్రాజెక్స్ నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ రెండు చిత్రాల నుంచి దీపికా తప్పుకున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అనేక రూమర్స్ హల్చల్ అయ్యాయి. దీపికా కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తానని చెప్పడం.. అలాగే అధికంగా రెమ్యునరేషన్ అడిగిందనే ప్రచారం నడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపికా ఈ విషయంపై స్పందించింది. వర్కింగ్ అవర్స్ కారణంగా ఆమె భారీ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకున్నారనే వార్తలపై ఆమె పరొక్షంగా స్పందించింది. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడింది.”ఒక మహిళ కావడం.. అది కూడా ఒత్తిడి కలిగించేది.. మరేదైనా అనిపిస్తే అలాగే ఉండకండి. ఒక నటిగా నాకు ఇబ్బంది అనిపిస్తే నేను అంగీకరించను. భారతీయ సినిమా పరిశ్రమలో చాలా మంది సూపర్ స్టార్స్, హీరోలు ఎన్నో సంవత్సరాలుగా 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. ఈ విషయం రహస్యం ఏమి కాదు. కానీ అది ఎప్పుడూ వార్తల్లోకి రాలేదు. నేను ఇప్పుడు వారి పేర్లు చెప్పి ఈ విషయాన్ని మార్చాలని అనుకోవడం లేదు. కానీ చాలా మంది హీరోలు రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ ఎనిమిది గంటలు మాత్రమే వర్క్ చేస్తారు. వీకెండ్స్ లో అసలు పనిచేయరు.” అంటూ చెప్పుకొచ్చింది దీపిక. అలాగే.. న్యాయంగా పోరాటం చేస్తున్న కారణంగా మీరు ఇబ్బందిపడ్డారా.. అని అడగ్గా.. దీపికా మాట్లాడుతూ.. “ఇది కొత్తేం కాదు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను. దీని గురించి ఎలా చెప్పాలనేది నాకు తెలియడం లేదు. ఎన్నో పోరాటాలను నిశ్శబ్దంగానే ఎదుర్కొన్నాను. కానీ కొన్ని కారణాలతో అవి బయటకు వస్తుంటాయి. నేను ఎప్పుడూ వాటిపై స్పందించను. సైలెంట్ గా యుద్ధాలను చేయడం మాత్రమే నాకు తెలుసు. అలా చేస్తేనే గౌరవంగా ఉంటుంది” అంటు చెప్పుకొచ్చారు. ఇటీవలే స్పిరిట్, కల్కి 2 ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఆమె షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో రాబోతున్న చిత్రంలో నటిస్తుంది. అలాగే అల్లు అర్జున్, అట్లీ సినిమాలో నటిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టైటిల్స్ విషయంలో సీక్రసీ మెయిన్‌టైన్ చేస్తున్న మేకర్స్.. ఎందుకీ సస్పెన్స్‌

భారీ వసూళ్లు సాధిస్తున్న మూవీ.. ఈ నెంబర్స్‌తో ఆ సినిమాలు బ్రేక్ ఈవెన్ అవుతున్నాయా.?

SS Rajamouli: ఇండియా నెం.1 డైరెక్టర్‌గా.. రాజమౌళికి మాత్రమే ఎలా సాధ్యం

Chandrababu Naidu: హైదరాబాద్ ను మించిన రాజధాని నిర్మించాలన్నదే లక్ష్యం

Tirupati: SV వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారం