Pawan Kalyan: పవన్.. సాయి ధరమ్ తేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్.. ఆ యంగ్ హీరోయిన్‌కు క్రేజీ ఛాన్స్ ?…
తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సిత్తం రీమేక్‌గా రాబోతున్నా ఈ సినిమా కోసం పవన్ కేవలం 20 రోజులు డేట్స్ ఇచ్చారట. అంతేకాదు.. గోపాల గోపాల తర్వాత మరోసారి దేవుడిగా కనిపించనున్నారు పవన్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా చేస్తుండగా.. ఆ తర్వాత డైరెక్టర్ హరిష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేయనున్నారు. అలాగే.. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలోనూ మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇవే కాకుండా.. ఇటీవల నటుడు కమ్ దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో చేయబోయే సినిమా ప్రారంభించారు. ఇందులో పవన్ అల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ కీలకపాత్రలో నటించనుండగా.. తేజ్ జోడిగా కేతిక శర్మ కనిపించనుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సిత్తం రీమేక్‌గా రాబోతున్నా ఈ సినిమా కోసం పవన్ కేవలం 20 రోజులు డేట్స్ ఇచ్చారట. అంతేకాదు.. గోపాల గోపాల తర్వాత మరోసారి దేవుడిగా కనిపించనున్నారు పవన్.
తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ నెట్టింట వైరలవుతుంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. మాతృక చిత్రంలో అసలు ఒక్క సాంగ్ కూడా లేదు. కానీ పవర్ స్టార్ సినిమా కాబట్టి ఫ్యాన్స్ కొన్ని అంశాలు కోరుకుంటారు. కాబట్టి ఇందులో ఓ స్పెషల్ సాంగ్ పెట్టాలని భావిస్తున్నారట మేకర్స్. ఇక ఈ పాట కోసం యంగ్ హీరోయిన్ శ్రీలీలను ఎంపిక చేయాలనుకుంటున్నారట. ఇటీవలే ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. తదుపరి చిత్రాల విషయంలో అచితూచి అడుగులు వేస్తుంది. మరీ పవన్ సరసన స్పెషల్ సాంగ్ చేసేందుకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ?లేదా ? అనేది చూడాలి.
ఇక ప్రస్తుతం సాయి తేజ్ విరూపాక్ష సినిమాతో బిజీగా ఉన్నారు. ఈమూవీ కంప్లీట్ అయిన తర్వాత వినోదయ సిత్తం సినిమాలో జాయిన్ కానున్నారు. మొదటిసారి పవన్, సాయి తేజ్ కాంబోలో సినిమా రాబోతుండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.