Bigg Boss 9 : ఛీ ఛీ.. మరీ ఇలా ఉన్నారేంట్రా.. కాళ్లతో తన్నుతూ లేడీ కంటెస్టెంట్ పై దాడి.. విజయ్ సేతుపతి సీరియస్..
ఇన్నాళ్లు తెలుగు బిగ్ బాస్ షో ప్రేక్షకులను అలరించింది. ఈసారి తెలుగులో కామనర్ కళ్యాణ్ పడాల విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషలలోనూ బిగ్ బాస్ రియాల్టీ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే తాజాగా తమిళ్ బిగ్ బాస్ షోలో దారుణంగా ప్రవర్తించారు ఇద్దరు కంటెస్టెంట్స్. కాళ్లతో తన్నుతూ లేడీ కంటెస్టెంట్ పట్ల అనుచితంగా ప్రవర్తించారు.

తమిళంలో బిగ్ బాస్ సీజన్ 9 రన్ అవుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5న ప్రారంభైన ఈ షో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ షోకు ప్రముఖ హీరో విజయ్ సేతుపతి హోస్టింగ్ చేస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా ఈ షోపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. నిర్వాకులతోపాటు హోస్ట్ విజయ్ సేతుపతిపై కూడా అడియన్స్ మండిపడుతున్నారు. అందుకు కారణం ఇద్దరు కంటెస్టెంట్స్. మొదటి నుంచి ఆ ఇద్దరి ప్రవర్తన, ఆట తీరు సరిగ్గా లేదని విమర్శలు వస్తున్నాయి. ఇదివరకు ఆ ఇద్దరికి విజయ్ సేతపతి వార్నింగ్ సైతం ఇచ్చారు. తమ ఆట తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినప్పటికీ ఆ ఇద్దరిలో ఎలాంటి మార్పులు లేదు. ఆ ఇద్దరి పేర్లు పార్వతి, కమ్రుద్దీన్. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో వీరిద్దరు ప్రేమపక్షులు. ఇటీవల డార్క్ రూంలో గంటకు పైగా ఉండడంతో బిగ్ బాస్ హెచ్చరించారు. వీరిద్దరికి సంబంధించిన వీడియోను నెట్టింట షేర్ చేస్తూ అడియన్స్ మండిపడ్డారు.
ఇప్పుడు మరోసారి వీరిద్దరు మరో లేడీ కంటెస్టెంట్ పై దారుణంగా ప్రవర్తించారు. జనవరి 2, 2026న హౌస్ లో టికెట్ టు ఫినాలే కోసం కార్ టాస్క్ జరిగింది. ఈ టాస్క్ సమయంలో కమ్రుద్దీన్, విజె పార్వతి ఇద్దరూ కలిసి మరో కంటెస్టెంట్ సాండ్రాను బలవంతంగా కారు నుంచి బయటకు తోసేశారు. ఆమె పై దాడి చేయొద్దని మిగతా కంటెస్టెంట్స్ అరుస్తున్నప్పటికీ వీరిద్దరు ఏమాత్రం పట్టించుకోలేదు. కాళ్లతో తన్నూతూ, కొడుతూ ఆమెను బయటకు నెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో కారు నుంచి కిందపడిపోవడంతో తలకు బలమైన గాయం అయ్యింది. దీంతో వెంటనే మెడికల్ రూంకు షిఫ్ట్ చేసారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఆ ఇద్దరి తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరి వల్ల ఇతర కంటెస్టెంట్స్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. వారిపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా విడుదలైన ప్రోమోలో హోస్ట్ విజయ్ సేతుపతి సైతం ఇద్దరి పై మండిపడ్డట్టు తెలుస్తోంది. కారు టాస్కులో మీ ఇద్దరి ప్రవర్తన.. ఇద్దరు సంబరాలు ఇంట్లో జరుపుకోండి.. మీ ఇంటి సభ్యులు మీకు స్వాగతం పలుకుతున్నారని అన్నారు. అనంతరం కమ్రుద్దీన్, పార్వతి ఇద్దరికి రెడ్ కార్డ్ ఇచ్చాడు. దీంతో అక్కడే ఉన్న ప్రేక్షకులు సంతోషంతో గంతులేశారు.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
#Day90 #Promo2 of #BiggBossTamil
Bigg Boss Tamil Season 9 – இன்று இரவு 9:30 மணிக்கு நம்ம விஜய் டிவில.. #BiggBossTamilSeason9 #OnnumePuriyala #BiggBossSeason9Tamil #BiggBoss9 #BiggBossSeason9 #VijaySethupathi #BiggBossTamil #BB9 #BiggBossSeason9 #VijayTV #VijayTelevision pic.twitter.com/pQfMdynnI0
— Vijay Television (@vijaytelevision) January 3, 2026
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
