Jana nayagan Trailer: విజయ్ దళపతి చివరి సినిమా.. జన నాయగన్ ట్రైలర్ వచ్చేసింది..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తోన్న సినిమా జన నాయగన్. అటు రాజకీయాలతో బిజీగా ఉన్న విజయ్ కనిపించనున్న చివరి సినిమా ఇదే. దీంతో ఈ మూవీపై మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్ధామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇన్నాళ్లు హీరోగా మెప్పించిన విజయ్.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. సొంతంగా పార్టీ స్థాపించి ఎన్నికలలో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. కొన్ని రోజులుగా అటు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటున్నాడు. అలాగే పూర్తిగా రాజకీయ నాయకుడిగా మారేందుకు సినిమాలకు సైతం రిటైర్మెంట్ ప్రకటింటారు. ఇప్పుడు ఆయన నటిస్తోన్న చివరి సినిమా జన నాయగన్. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమాను జనవరి 9న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ప్రమోషన్స్ నిర్వహిస్తంది చిత్రయూనిట్.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..
తాజాగా శనివారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. తెలుగులో ఈ సినిమాను జన నాయకుడు పేరుతో రిలీజ్ చేయనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది. అలాగే మమితా బైజు, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్ సైతం మూవీపై మరింత బజ్ క్రియేట్ చేసింది.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
యాక్షన్ తోపాటు బలమైన భావోద్వైగాలు నిండిన మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. విజయ్ దళపతికి తమిళంతోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్నాళ్లు ఆయన సినిమాలు తెలుగులోకి డబ్ చేయగా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇటీవల వారసుడు సినిమాతో నేరుగు తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు జన నాయకుడు మూవీతో మరోసారి టాలీవుడ్ అడియన్స్ ముందుకు వస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
