ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్ ఆసుపత్రిలో నవజాత శిశువు ఇంక్యుబేటర్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదంలో సజీవ దహనమైన విషాద ఘటన చోటుచేసుకుంది. బిడ్డను అప్పగించిన గంటల తర్వాత తల్లిదండ్రులకు ఈ భయంకర వార్త అందింది. ఈ ఘటన ప్రమాదమా లేక నిర్లక్ష్యమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధ్యులెవరు అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది.