మరోసారి ఆ స్టార్ హీరోకు జోడీగా నటించనున్న ఆషిక..

Rajeev 

Pic credit - Instagram

10 February 2026

 ఆషికా రంగనాథ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా అందం, అభినయంతో కట్టిపడేసింది.

నటించిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ అమ్మడి క్రేజ్ మరింత పెరిగింది.

అయితే సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం అందాలతో గత్తరలేపుతోంది.

గ్లామర్ లుక్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఇటీవలే ఈ అమ్మడు మాస్ రాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో నటించింది.

ఈ సినిమాలో తన గ్లామర్ తో కట్టిపడేసింది ఈ వయ్యారి భామ. ఓ రేంజ్ లో అందాలతో ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు నాగార్జునతో మరోసారి నటిస్తుందని టాక్. గతంలో నా సామీ రంగ సినిమాలో నటించింది. ఇప్పుడు నాగ్ 100వ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని ఇండస్ట్రీ టాక్.